/rtv/media/media_files/2025/03/29/PY2SZuAYuT08b9RI1ziS.jpg)
Parents attack teacher in Kadapa
AP Crime : టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కడప జిల్లా బద్వేల్ లోని లిటిల్ ప్లవర్ పాఠశాలలో జరిగింది.
ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
పోలీసుల కథనం మేరకు.. లిటిల్ ప్లవర్ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్వర్‌బాషా కొంత కాలంగా నాల్గవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడ్ని చితక బాదారు. దీంతో పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడ్ని స్టేషన్‌కు తరలించి, విచారణ చేపడుతున్నారు.
ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
Also Read: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!
అన్వర్ నాల్గవతరగతి విద్యార్థినిని తరగతి గదిలోకి తీసుకెళ్లి ప్రయివేట్ పార్ట్స్‌పై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పుకుంది.దీంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థిని బంధువులు, ఇరుగుపొరుగువారు అన్వర్ బాషాపై దాడి చేశారు. దీంతో పాఠశాలలో గందరగోళం నెలకొంది . విషయం తెలిసిన పోలీసులు పాఠశాలకు చేరుకుని అన్వర్‌ను స్టేషన్‌కు తరలించారుబాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్