Ap Crime News: ‘అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి’.. ఎంత పని చేశావ్‌రా దుర్మార్గుడా!

పల్నాడుకు చెందిన 31ఏళ్ల నాగరాజు 13ఏళ్ల బాలికను లోబర్చుకుని ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు. బాలిక తల్లిదండ్రుల మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కోపంతో నాగరాజు అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి అంటూ ట్రైన్ బోగీలపై బాలిక నంబర్ రాశాడు.

New Update
Palnadu man Nagaraj made 13 year old girl mother of two children

Palnadu man Nagaraj made 13 year old girl mother of two children

ఏపీలో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన బత్తుల నాగరాజు (31)కు గతంలో పెళ్లైంది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2017లో 13ఏళ్ల బాలికపై అతడి కన్ను పడింది. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. దీని కోసం పక్కా ప్రణాళిక రచించాడు. ఆ బాలికను మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు. 

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

పిల్లలను అమ్మేసి

ఇదంతా ఒకెత్తయితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. దత్తత పేరుతో ఆ పిల్లలను డబ్బుల కోసం అమ్మేశాడు. అలా కొద్ది రోజులు నంద్యాలలోని ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేశాడు. ఇక అదే సమయంలో ఆ 13 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆ బాలిక నంద్యాలలో ఉన్నట్లు తెలిసింది.

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

వెంటనే ఆ బాలికను పోలీసులు తీసుకొచ్చారు. దీంతో తన గుట్టు రట్టవుతుందనే భయంతో నాగరాజు ఆ బాలికను పెళ్లి చేసుకున్నట్లు తాళి కట్టాడు. ఇక నాగరాజుకు గతంలో పెళ్లైయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి ఊరి పెద్దల ముందు పంచాయితీ పెట్టింది. అప్పటి నుంచి నాగరాజుకు దూరంగా.. తన తల్లి ఇంటివద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఆ బాలికను తనవద్దకు రప్పించుకునేందుకు నాగరాజు మరోప్లాన్ వేశాడు. బాలిక తల్లిదండ్రులపై దుష్ప్రచారం చేశాడు. 

Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

బోగీలపై బాలిక ఫోన్ నెంబర్

అంతేకాకుండా ట్రైన్ బోగీలపై ఆ బాలిక ఫోన్ నెంబర్ రాసి.. అమ్మాయిలు కావాలంటే ఈ నెంబర్‌ను సంప్రదించండి అని రాశాడు. అలాగే తన పిల్లలను ఆ బాలిక ఫ్యామిలీ వేరే వారికి అమ్మేసిందని పోలీస్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ఈ విషయంపై ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. నాగరాజు కావాలనే తప్పుడు కేసులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఆ బాలిక సైతం అతడిపై కేసు వేసింది. తనను మానసికంగానూ, శారీరకంగానూ వేధించాడని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు