Ap News: విద్యుత్ స్తంభం పైకి దూసుకెళ్లిన కారు.. మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం!

ప్రకాశం జిల్లా కొమరోలులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లి వీరంగం చేశాడు. అలాగే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

New Update
Prakasam district

Prakasam district

Prakasam district: ప్రకాశం జిల్లా కొమరోలులో కారు  బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో  డ్రైవర్ రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లి వీరంగం చేశాడు. అలాగే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ongole-news | prakasam-district | car-accident | ap

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Weather Report: ఏపీలో వింత వాతావరణం.. అక్కడ ఎండలు ..ఇక్కడ వానలు!

ఏపీలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలతో చల్లగా ఉంటోంది. అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

New Update
weather Updates

ఏపీలో వాతావరణం విచిత్రంగా ఉంది.. కొన్ని జిల్లాల్లో ఎండలు అదరగొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు మంగళ,బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లోపే నమోదైనట్లు తెలిపారు. రాబోయే మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశాలున్నాయన్నారు.

Also Read:  Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

బుధవారం అనకాపల్లి జిల్లా మాడుగులలో 39.4, కడప జిల్లా దువ్వూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు కాస్త విచిత్రమైన వాతావరణ అంచనాలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. 

Also Read:  Trump-Musk:డోజ్‌ నుంచి మస్క్‌ ఔట్‌..!

శుక్రవారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. ఎవరూ చెట్లు కింద నిలబడకూడదన్నారు. మంగళ, బుధవారాల్లో మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మరో రెండు వారాలపాటు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయనిఅధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో.. ఈ నెల 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు. ద్రోణి ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రానికి వర్షసూచన ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగండల్ వానలు పడతాయనే అంచనాతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Also Read: Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

Also Read: Horoscope:నేడు ఈ రాశి వారికి అన్నింటా విజయమే!

ap | weather | andhra pradesh weather | andhra-pradesh-weather-report | ap today weather update | andhra-pradesh-weather-forecast | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment