జంతువుల నుంచి నూనె ఎలా తయారు చేస్తారో తెలుసా ?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం దుమారం రేపుతోంది. అసలు జంతువుల నుంచి నూనె ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
OIL

తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డూ తయారీ చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం అన్నారు. తిరుపతి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని మండిపడ్డారు. నాసిరకమైన సరకులు వాడటమే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్‌ వాడినట్లు తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొచ్చి లడ్డూ ప్రసాదం తయారీ చేసేందుకు వాడుతున్నామని చెప్పారు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు బాధగా అనిపించిందని.. ప్రస్తుతం లడ్డూ ప్రసాదంలో, అన్నదానంలో నాణ్యతను పాటిస్తున్నామని చెప్పారు. నాణ్యతను మరింత పెంచుతామని పేర్కొన్నారు. 

జంతు వ్యర్థాలతో నూనె ఎలా వస్తుంది ?

పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం అలాగే చనిపోయిన జంతువల కళేబరాలను పలు మూతబడిన ఫ్యాక్టరీల్లోకి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత అందులో ఉండే భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వు, జంతు కళేబరాలను మరగబెడుతున్నారు. ఆ తర్వాత వాటి నుంచి నూనెను బయటకు తీస్తున్నారు. దాన్ని డబ్బాలు, ప్యాకెట్లలో నింపి వాటికి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి విక్రయిస్తున్నారు. వీటివల్ల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. హైదరాబాద్‌ నగర పరిధిలోనే వీటి దందా ఎక్కువగా కొనసాగుతోంది.

Also Read: జమిలి ఎన్నికలతో దేశానికి నష్టమా? లాభమా?

జంతువుల నుంచి తీసే ఈ కల్తీ నూనెతో ఏటా కేన్సర్‌ కేసులు కూడా పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒకసారి వినియోగించిన నూనెను మళ్లీ వాడటంతో ఇలా రోగాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కల్తీ నూనె వల్ల రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ కల్తీ నూనె వల్ల కాలేయం, కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అందులో ఉండే హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అనేది కేన్సర్‌కు దారితీస్తుందని.. కనీసం ఆ నూనె వాసన పీల్చినా కూడా ప్రమాదమే అనే చెబుతున్నారు.

వాస్తవానికి శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగు రాదు. దాని రంగు చాల స్వచ్ఛంగా ఉంటుంది. కానీ జంతు కళేబరాలతో తయారు చేసిన నూనెలో పొంగు వస్తుంది. అలాగే దుర్వాసన కూడా వస్తుంది. మరో విషయం ఏంటంటే ఇండియాను బ్రిటిష్‌ వాళ్లు పాలించినప్పుడు వారి తుపాకి తుటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వును పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో దాన్ని కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. అప్పట్లో ఇది హిందూ, ముస్లింల మత విశ్వాసాలకు విరుద్ధమని పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.

Also Read: పని ఒత్తిడితో పూణేలో ఉద్యోగి మృతి.. రంగంలోకి కార్మిక శాఖ!

అయితే ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారు చేసేందుకు నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు ఆరోపణలు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన రేపుతోంది. ప్రతిరోజూ తిరుమలకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇలా జంతువుల నుంచి తీసిన నూనెను లడ్డూలు తయారుచేసేందుకు వాడారంటే అది వాళ్ల మత నమ్మకాలను దెబ్బతీసినట్లే అవుతోంది. అందుకే ప్రస్తుతం ఈ అంశం తెలుగురాష్ట్రాల్లో దుమారం రేపుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

New Update
EC

AP by-election EC notification released

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదలచేసి మే 9న పోలింగ్ జరగనుంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

29 వరకు నామినేషన్ల స్వీకరణ..

ఈ మేరకు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తంగా మే 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

 

mp | ap | ec | notification | telugu-news | today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment