/rtv/media/media_files/2026/03/27/vpa-2026-03-27-11-12-43.jpg)
oil-and-lpg-ships-to-arrives-at-visakhapatnam-port
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడటంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. అయితే భారత్‌లోని విశాఖ తీరానికి LPG, చమురు నౌకలు ఒక్కొక్కటిగా వస్తుండటం కాస్త ఊరటనిస్తోంది. దీంతో దేశంలో ఆయుల్ సమస్యలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. 24 వేల మెట్రిక్ టన్నుల (TMC) ఎల్పీజీ గ్యాస్‌తో 'BW బ్రీచ్' అనే భారీ నౌక గురువారం విశాఖకు వచ్చింది. శుక్రవారం ఈ నౌకలో ఉన్న గ్యాస్‌ను అన్‌లోడ్ చేయనున్నారు.
మరోవైపు నెదర్లాండ్ లోడింగ్ అయిన హెల్లాస్ గ్లాడియేటర్ నౌక అలాగే అమెరికా పోర్టులో లోడింగ్ చేసుకున్న జుపిటర్ నౌక మార్చి 30న విశాఖకు రానున్నాయి. ఫిబ్రవరి 26న మార్చి 3న ఇప్పటికే యూఏఈ, ఖతార్ నుంచి లుపినస్ (22 టీఎంటీ), ఏఐ వుకిర్ (26 టీఎంటీ) నౌకలు విశాఖకు చేరుకున్న సంగతి తెలిసిందే.
Also Read: వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)కు చెందిన ఎంవీ సమర్ శృతి నౌకకు విశాఖ పోర్టులో యాంకరేజీలో లంగర్ వేశారు. 65 వేల టన్నుల హైస్పీడ్ డీజిల్‌ను అన్‌లోడ్ చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో ఎంవీ స్వర్ణ సింధు అనే క్రూడ్ ఆయిల్ నౌక కూడా విశాఖకు చేరుకోనుంది. రష్యా నుంచి జంబో నౌక 1,36,728 టన్నుల క్రూడ్ ఆయిల్‌తో శుక్రవారం రానుంది. ఇక ఏప్రిల్ 2, 5వ తేదీల్లో రష్యా నుంచి ఫౌండేయ, దేశ్ గౌరవ్ (ముంద్రా పోర్టు) ముడి చమురు నౌకలు రానున్నాయి. మార్చి 1 నుంచి 25 వరకు ఖతార్, UAE, రష్యా, భారత్‌లోని పలు పోర్టుల నుంచి విశాఖకు 10 చమురు నౌకలు చేరినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో న్యూ మంగళూరు పోర్టుకు 40 వేల టన్నుల LPGతో అపోలో ఓషియన్ నౌక గురువారం చేరింది. ఇక ముడి చమురు నౌకతో మరో రెండు నౌకలు కూడా త్వరలో పోర్టుకు రానున్నాయి. రష్యా నుంచి లక్ష టన్నుల ముడి చమురుతో మూడో నౌక గురువారం చెన్నై హార్బర్‌కు చేరింది. శనివారం మరో నౌక చేరుకోనుంది.
Also Read: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్
Follow Us