Subbarao: ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య తండ్రి ఎమోషనల్ ఇంటర్వ్యూ..
ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య చనిపోయి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చైతన్య తండ్రి ఎమోషనల్ అయ్యారు. RTVతో మాట్లాడుతూ.. అనుకున్నంత ప్రోత్సాహం లేకపోవడంతోనే చైతన్య చనిపోయి ఉంటారని అన్నారు.
ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య చనిపోయి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చైతన్య తండ్రి ఎమోషనల్ అయ్యారు. RTVతో మాట్లాడుతూ.. అనుకున్నంత ప్రోత్సాహం లేకపోవడంతోనే చైతన్య చనిపోయి ఉంటారని అన్నారు.
ఏపీలో జరుగుతున్న అల్లర్లకు వైసీపీ రౌడీ మూకలే కారణమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ గెలవబోతుందనే కోపంతో వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు.
పోలవరం నియోజకవర్గంలో ఓట్లకు నోట్లు పంపకాల్లో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డబ్బులు చుట్టుపక్కల వారికే ఇచ్చి తమకు ఎగనామం పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ ప్రకటించారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను భద్రపరిచామన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91, తిరుపతిలో అత్యల్పంగా 63 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. సీఈవో ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా మృతి చెందాడు.
నెల్లూరు జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. 2024 ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని కామెంట్స్ చేశారు.
నెల్లూరు జిల్లా నాగలవెల్లటూరులో టీడీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన కార్యకర్తలు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్యపై..కొందరు దాడి చేయడంతో వివాదం మొదలైంది. ఘర్షణలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంను కార్యకర్తలు పక్కకు తోసేశారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.