/rtv/media/media_files/2025/01/26/yCyHXUi0sXBtjQQel8oH.jpg)
Nandamuri Balakrishna Padma Vibhushan
ప్రముఖ టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు కేంద్రం నిన్న పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan Award) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.
Also Read : అదిరిపోయిందిగా... విజయ్ 69 మూవీ టైటిల్ ఫిక్స్!
తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానన్నారు.#PadmaBhushanNBK #PadmaBhushan #PadmaAwards2025… pic.twitter.com/l13AMwcmHT
— RTV (@RTVnewsnetwork) January 26, 2025
Also Read : ఖడ్గం పెట్టిన భయం.. తుపాకీతో శ్రీకాంత్, అండర్ గ్రౌండ్ లోకి కృష్ణవంశీ
ప్రేక్షకులకు రుణపడి ఉంటా..
తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు.
Also Read : ప్రముఖ దర్శకుడు మృతి.. దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ!
Received Call from our legend GOD OF MASSES #NandamuriBalkrishna garu Congratulated him for #PadmaBhushan Award.. 🦁🎉
— Sailendra Medarametla ᴹᵃʰᵃʳᵃᵃʲ (@sailendramedar2) January 25, 2025
Memorable moment forever sharing fan boy moment with Annaya..❤️
Jai Balayya ✊#PadmaBhushanNBK pic.twitter.com/xqoNzZG0bV
Also Read : పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీళ్లే!