Revanth Vs Manda Krishna: నాకు పద్మశ్రీ వస్తే నీకేం నొప్పి.. రేవంత్ పై భగ్గుమన్న మందకృష్ణ!

తనకు పద్మశ్రీ వస్తే సీఎం రేవంత్ కు ఎందుకు అంత బాధ అని మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తన పేరు ఎందుకు సిఫారసు చేయలేదని ప్రశ్నించారు. తనకు ఉద్యమ చరిత్ర లేదా? అని ధ్వజమెత్తారు. రేవంత్ సూచించిన వారు ప్రభుత్వం నుంచి ఇప్పటికే లబ్ధిపొందారన్నారు.

New Update

సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సిఫారసు చేసిన వ్యాక్తులకు పద్మ పురస్కారం రాలేదని రేవంత్ బాధపడుతున్నాడో లేదా తనకు వచ్చిందని బాధపడుతున్నాడో.. అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్ల ఉద్యమంలో తనకు చరిత్ర లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సిఫారసు చేసిన వ్యక్తుల జాబితాలో తన పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. వారంతా ఇప్పటికే ప్రభుత్వం నుంచి లబ్ధిపొందారన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: గద్దర్ ఓ నక్సలైట్.. ఆయనకు అవార్డు ఇచ్చేదేలేదు.. బండి షాకింగ్ కామెంట్స్!

గద్దర్, గోరటి పేర్లు ఎందుకు పంపావ్?

తాను బీజేపీ మనిషిని అనుకుంటే.. గద్దర్, గోరెటి వెంకన్న పేర్లను బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు పంపించాడని ప్రశ్నించారు. లేఖ రాసి వదిలిపెట్టి కేంద్రాన్ని బదనాం చేయడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచించిన వ్యక్తులకు పురస్కారం వచ్చేలా ఏమైనా ప్రయత్నాలు చేశారా? అన్న అంశం తేలాలలన్నారు. నాకు పద్మశ్రీ రావడంపై రేవంత్ రెడ్డి బాధపడుతున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు. మందకృష్ణకు పద్మా పురస్కారం రావడం సంతోషమే కానీ.. అంటూ నిన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మందకృష్ణ.

కేంద్రంపై రేవంత్ అసంతృప్తి..

పద్మ పురస్కారాల విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు తదితర ప్రముఖులకు పద్మశ్రీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని వెల్లడించారు. కేంద్రం ఆ ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకోకపోవడం నాలుగు కోట్ల ప్రజలను అమానించడమేనన్నారు. 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం తెలంగాణకు కనీసం 5 పురస్కరాలు కూడా ప్రకటించకపోవడం సరికాదన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు