/rtv/media/media_files/2025/03/24/DZR0zQmdaWirxj87fIVg.jpg)
Vidadala Rajini vs Lavu Sri Krishna Devarayalu
Vidadala Rajini vs Lavu Sri Krishna Devarayalu : చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని వర్సెస్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య పోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. నువ్వు కబ్జా చేసావంటే....నువ్వు వసూళ్లకు పాల్పడ్డావు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుటున్నారు. కాల్ డేటా తీయించావు అని ఒకరంటే...అలాంటి పనులు నేను చేయను అంటూ మరోకరు కౌంటర్ ఇస్తున్నారు. ఇలా వరుస విమర్శలు..ప్రతి విమర్శలతో చిలకలూరిపేట రాజకీయం వేడెక్కింది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆదేశాలతోనే తనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారని విడదల రజిని ఆరోపించారు. అంతేకాదు వైసీపీ హయాంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల కాల్ డేటాను ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సేకరించారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఎంపీ కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారని...తాను ఎప్పుడూ కాల్ డేటా సేకరించలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు విడదల రజిని ఎంతోమంది దగ్గర వసూళ్లు చేశారని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఆరోపించారు.
Also Read:IMD -Ap: మరో నాలుగు రోజులు వడగళ్ల వానలు..జాగ్రత్త..వాతావరణ శాఖ హెచ్చరికలు!
చిలకలూరిపేట రాజకీయాలు కూటమి వర్సెస్ వైసీపీగా మారుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంతో మెుదలైన రచ్చ అనేక మలుపులు తిరుగుతోంది. మాజీమంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కేసులు పెట్టించింది ఎంపీ లావు శ్రీకృష్ణాదేవరాయలు అని ఆరోపించారు. గతంలో తనతోపాటు తన కుటుంబం..తన ఆఫీస్ సిబ్బంది కాల్ డేటా తీసుకున్నారని దాంతో తాను జగన్‌కు ఫిర్యాదు చేయగా ఆయన మందలించడంతో అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకున్నారని మాజీమంత్రి విడదల రజిని ఆరోపించారు. అంతేకాదు ఎంపీలావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. విడదల రజిని ఆరోపణలకు ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. ‘నేను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపిస్తున్నారు.. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. అలాంటి క్యారెక్టర్ నాది కాదు’ అని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కౌంటర్ ఇచ్చారు.
Also Read: PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన!
తాము 40 ఏళ్లుగా విజ్ఞాన్ సంస్థలు నడుపుతున్నాం తాము ఎలాంటి భూమి కోసం ప్రభుత్వానికి లేఖలు రాయలేదు అని చెప్పుకొచ్చారు లావు శ్రీ కృష్ణదేవరాయలు. ఏపీలో కాలేజీలు పెడతాం భూములు ఇవ్వాలని తాను ఏ ప్రభుత్వాన్ని కోరలేదు అని చెప్పుకొచ్చారు. అమరావతిలో అనేకమంది తమ కాలేజీలు, సంస్థల కోసం భూములు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారని కానీ తాను అమరావతిలో భూమి కోసం దరఖాస్తు చేయలేదు అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకొచ్చారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంవేస్తే.. పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నాం అని వివరణ ఇచ్చారు. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంది అని ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సూచించారు.
Also Read: Hotels & Restaurant: భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు ఆ హోటల్స్ ఓపెన్!
మాజీమంత్రి విడదల రజిని స్టోన్ క్రషర్ దగ్గర నుంచి మాత్రమే కాదని చిలకలూరిపేటలో చాలా మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు. ఈ స్టోన్ క్రషర్ కేసును వెనక్కి తీసుకోవాలని 10 రోజుల క్రితం ఓ వ్యక్తిని తన దగ్గరికి రాయబారానికి పంపలేదా అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు రాయబారానికి పంపించారు అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిలదీశారు. దుర్గారావు అనే కౌన్సిలర్ వద్ద ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తానని కేసు వాపస్ తీసుకోవాలని తన వద్దకు రాయబారం పంపలేదా? ఏ తప్పు చేయకపోతే ఎందుకు రాయబారానికి పంపించారు అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించారు.