/rtv/media/media_files/2025/03/17/uZFWZaQRHqXq7BF5L8QH.jpg)
The son who killed his mother
SON killed mother : మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు... మనిషిలో మానవత్వం కనుమరుగవుతోందని ఓ కవి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చేలా ఏకంగా కన్నతల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు..చిన్నకారణంతో తల్లిని చంపడంతో విషాదం నెలకొంది.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
Also read: Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది
కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అచ్యుతాపురానికి చెందిన షేక్ జహీరా కుమారుడు షబీర్ బీటెక్ మధ్యలోనే మానేసి ఖాళీగా ఉంటున్నాడు. గత కొంతకాలంగా డిప్రెషన్‌కు గురికావడంతో అతనికి చికిత్స అందిస్తున్నారు.
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో ఇంటి దగ్గర ఖాళీ గా ఉంటున్నావు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి మందలించింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన షబీర్ పిడికిలితో తల్లి నుదుటిపై గుద్దాడు. అయితే ఆ దెబ్బ చెవి పై భాగాన కణితపై తగలడం తో తల్లి షేక్ జహీర్ బీబీ ఒక్క సారిగా కుప్పకూలి మృతిచెందింది.ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pawan kalyan: నేను హిందీని వ్యతిరేకించలేదు.. పవన్ సంచలన పోస్ట్!
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!