/rtv/media/media_files/2025/01/26/AQr4UdQ0mAfDYx1Wgnyb.jpg)
mother suicide attempt with her kids at vizag
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మరణిస్తున్నారు. తరచూ ఇలాంటి వ్యవహారాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే జరిగింది. భార్య, భర్తల మధ్య వచ్చిన ఒక చిన్న గొడవ ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఆ ఇంటి ఇల్లాలు తన ఇద్దరు పిల్లలతో ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. ఇందులో ఆమెతో పాటు ఒక కూతురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.
తగరపువలసలో నివాసం
మహంతి రామకృష్ణ (34)కు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురం గ్రామానికి చెందిన మాధవికి గతంలో వివాహమైంది. వీరికి ఇషిత (5), రితీక్ష (18 నెలలు) ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామకృష్ణ విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరు తగరపువలసలో నివాసముంటున్నారు. ఒకరోజు భర్త ఫోన్‌లో అన్‌నౌన్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌ను భార్య మాధవి చూసింది.
అన్నంలో పురుగుల మందు
వెంటనే అతడిని ప్రశ్నించింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రామకృష్ణ ఏమీ తినకుండా డ్యూటీకి వెళ్లిపోయాడు. మాధవి మాత్రం మనస్థాపంతో అన్నంలో పురుగుల మందు కలిపి తాను తిని.. తన పిల్లలకు పెట్టింది. అదే సమయంలో తన తండ్రి ఫోన్ చేయగా.. మాట్లాడుతూ ఫోన్ కట్ అయింది. దీంతో మళ్లీ ఆయన ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎత్తలేదు.
Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?
కంగారు పడి సమీపంలో ఉన్న తమ బంధువులకు చెప్పాడు. వారు వచ్చి చూడగా మాధవితో పాటు ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే రామకృష్ణకు ఫోన్ చేసి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మాధవి శనివారం మృతి చెందింది. అనంతరం చిన్న కూతురు రితీక్ష కూడా మరణించింది. ప్రస్తుతం ఇషిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.