/rtv/media/media_files/2025/04/07/CzVPzdi3WofUO5n4FBal.jpg)
minister nara lokesh repost krishna district police drone video
నేరాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం విచ్చల విడిగా టెక్నాలజీని వాడేస్తుంది. దీంతో తప్పు చేస్తున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు, ఎక్కడ ఏ తప్పుచేసి దొరికిపోతామో అనే టెన్షన్‌లో కొందరు బిక్కు బిక్కుమంటున్నారు. ఇందులో భాగంగానే నేరాల నియంత్రణకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
డ్రోన్లతో తప్పు చేసిన వారిని వెంబడించి మరీ పట్టుకుంటున్నారు. ఇటీవలే ఒక లారీలో పేకాట ఆడుతున్న కొందమందిని డ్రోన్లతో కనిపెట్టి వారిని అరెస్టు చేశారు. తాజాగా అలాంటిదే మరొక సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు పొలాల్లోకి వెళ్లి మందుతాగుతున్న సమయంలో పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వారిని పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!
డ్రోన్లతో పట్టుకున్న పోలీసులు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గుడివాడ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక వైపు ఇద్దరు వ్యక్తులు కూర్చుని పబ్లిక్‌గా మద్యం తాగుతున్నారు. అదే సమయంలో వారు డ్రోన్ కెమెరాలకు చిక్కారు. వాటిని చూడగానే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు డ్రోన్ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ ఇద్దరిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.
Feel sorry for the guys relaxing in the fields. 😬 Can't help, because the @appolice100 drones do their job. https://t.co/Ndzmhqfvy1
— Lokesh Nara (@naralokesh) April 7, 2025
Also read : పెళ్లిలో చెప్పుల గొడవ.. నా కొడకా అంటూ పెళ్లి కొడుకుని ఊతికారేశారు!
లోకేష్ రియాక్షన్
దీనికి సంబంధించిన వీడియోను ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ‘ఎక్స్’లో షేర్ చూస్తూ ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. ‘‘సారీ గాయ్స్.. నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. ఎందుకంటే మీరు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ దొరికిపోయారు’’ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.
Also read : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్
(ap minister nara lokesh | drone-camera | latest-telugu-news | telugu-news | viral-video)