Nara Lokesh: నేను జగన్ రెడ్డి బాధితుడినే.. లోకేష్ ఫైర్!

AP: గత ఐదేళ్లలో రాష్ట్ర నాశనం అయిందని అన్నారు లోకేష్. తాను కూడా జగన్ బాధితుడిని చెప్పారు. పాదయాత్రలో మాట్లాడుతుంటే తన స్టూల్, మైక్ లాగేశారని మండిపడ్డారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారని చెప్పారు. వారికి సినిమా చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చారు.

New Update
LOKESH

Nara Lokesh: గత ప్రభుత్వ హయాంలో ఏపీ నాశనం అయిందని అన్నారు మంత్రి లోకేష్. ప్రస్తుతం ఆయన ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా విదేషీన్ పర్యటన చేపట్టారు. ఎన్ఆర్ఐలు సైకో బాధితులే అని అన్నారు. కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. వైసీపీ వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. అడుగడుగునా అవమానించారు, అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. 

Also Read: నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

నేను కూడా బాధితుడినే....

తాను కూడా జగన్  ప్రభుత్వంలో బాధితుడ్నే అని అన్నారు. తాను యువగళం పాదయాత్ర చేస్తుంటే జిఓ1 తెచ్చి అడ్డుకోవాలని చూశారని అన్నారు.  ఆ జిఓను మడతపెట్టి జేబులో పెట్టుకోమని చెప్పానన్నారు. పాదయాత్రలో మాట్లాడుతుంటే నా స్టూల్, మైక్ లాగేశారని మండిపడ్డారు. అడుగడుగునా ఇబ్బంది పెట్టారు.. ఆ సమయంలో నాకు అండగా నిలచింది టీడీపీ కార్యకర్తలు అని కొనియాడారు. ఆరోజే ఎర్ర బుక్కు గురించి చెప్పానని అన్నారు. ఇప్పుడు జగన్ గుడ్ బుక్ తెరుస్తాడంట, నోట్ బుక్ చదవడమే రాదు, గుడ్ బుక్ లో ఏం రాస్తారు? గత అయిదేళ్ల అరాచక పాలనలో పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చురకలు అంటించారు. ఇప్పుడు పెట్టుబడులు తెచ్చే బాధ్యత కూడా  తనపై ఉందని అన్నారు.

Also Read:  శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలోగా దర్శనం..!

వారికి సినిమా చూపించే బాధ్యత నాది..

లోకేష్ మాట్లాడుతూ.. "రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయింది, రెండోది ఓపెన్ అయింది, మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నా. ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారు. బాబు గారు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2 నిమిషాల పని. చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? ప్రజలు మనకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి. గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలుచేస్తాం. నేను తగ్గేదే లేదు, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత లోకేష్ ది. మేం కూడా మనుషులమే. విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, అంతమాత్రాన అలిగి పడుకోవద్దు. మా దృష్టికి తెస్తే సరిచేసుకుంటాం. మీకు ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తా." అని అన్నారు.

Also Read: దీపావళి వేడుకల్లో అపశృతి..సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 40 మంది

Also Read: వాట్సాప్‌లో సరికొత్త కొత్త చాట్ ఫీచర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు