/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/srisailam-jpg.webp)
Srisailam Darshan Mahashivratri Brahmotsavam
Srisailam Darshan: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల(Mahashivratri Brahmotsavam) కోసం సర్వాంగ సుందరంగా శ్రీశైలం రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది. పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్గాలు.. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసారు. ఇక, శ్రీశైలం కు వచ్చే భక్తులకు పోలీసులు కీలక సూచనలు ఇస్తున్నారు.
Aslo Read: US JOBS-Trump: 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్!
శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా.. తాజా నిర్ణయాలకు సహకరించాలని పోలీసు అధికారులు భక్తులకు సూచించారు.
Also Read: Telangana:టికెట్ పై లేకపోయినా సరే..కట్టాల్సిందే ..ఎలక్ట్రిక్ బస్సులో గ్రీన్ ట్యాక్స్!
క్షేత్రానికి వచ్చే వాహనాల కోసం శిఖరం వద్ద నుంచి ముఖద్వారం, సాక్షి గణపతి, హటకేశ్వరం, రామయ్య టర్నింగ్ టోల్‌గెట్, శ్రీశైలంలోని పరిసర ప్రాంతాలు, శ్రీశైలం ముఖద్వారం నుంచి సున్నిపెంట, లింగాలగట్టు, తెలంగాణ బోర్డర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సుమారు 800 మందిని ట్రాఫిక్ నియంత్రణ కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు.రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా ఎనిమిది డ్రోన్ కెమెరాలతో నిఘా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
నైపుణ్యం ఉన్న డ్రైవర్లను..
ముఖ్య కూడళ్లలో పికెట్స్ ఏర్పాటు చేశారు. ఇక క్షేత్రానికి వచ్చే భక్తులు పలు సూచనలు పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఘాట్‌రోడ్డు కారణంగా వాహనాల్లో వచ్చే సమయంలో నైపుణ్యం ఉన్న డ్రైవర్లను వెంట తీసుకురావాలని చెప్పారు. భారీ గూడ్స్ వాహనాలు శ్రీశైలం వరకు అనుమతి ఉండదని అధికారులు తేల్చి చెప్పారు. ముఖ్యం గా సాక్షి గణపతి రామయ్య టర్నింగ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలుపొద్దని అధికారులు చెబుతున్నారు.
దీనికి కొనసాగింపుగా ఔటర్ రింగ్ రోడ్డు యజ్ఞశాల ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, ఇతర బస్సుల కోసం విశాలంగా పార్కింగ్ సిద్దం చేసారు. ఔటర్ రింగ్ రోడ్డు కొత్త పార్కింగ్ స్థలం వద్ద కార్లు, తేలిక పాటి వాహనాలు నిలిపేందుకు మరో పార్కింగ్ కేటాయించారు. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మాత్రమే ఉంచాలని..అలా కాదు అని వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపితే టోయింగ్ యంత్రం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు. వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారు లు వెల్లడించారు.
Also Read: Raja Singh:రేపు అయినా నీ తల నరికేస్తాం....రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్లు!
Also Read: Anushka Sarma: కోహ్లీ సూపర్ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే!