Maha Shivaratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు!

మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం నుంచే లక్షలసంఖ్యలో శ్రీగిరికి బయల్దేరారు. ఇక ఇవాళ వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.

New Update
Maha shivratri special Devotees flock to Srisailam temple

Maha shivratri special Devotees flock to Srisailam temple

Maha Shivaratri 2025 : మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా ఆలయాలన్నీ అంగరంగ వైభవంగా, సుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల కాంతుల మధ్య ఆలయాలు అద్భుతంగా తయారయ్యాయి. ఈ తరుణంలో భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు.

Also Read: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Srisailam Temple

భక్తి శ్రద్ధలతో భగవంతున్ని పూజిస్తున్నారు. ముఖ్యంగా భక్తులు శ్రీశైలం (Srisailam) ఆలయానికి తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. మంగళవారం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి వెళ్లారు. ఇవాళ (బుధవారం) వేకువజాము నుంచే శ్రీశైల ఆలయంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు.

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

అనంతరం భక్తులు పున్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల తాకిడికి రద్దీ పెరిగిపోవడంతో లైన్లలో నిల్చుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. ఇక ఈ ఆలయానికి చాలా మంది భక్తులు నల్లమల అడవుల్లో నుంచి కాలినడకన వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

అయితే ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం.. ఈ ఏడాది లడ్డూ ప్రసాదం, చిన్న పిల్లలకు పాలు అల్పాహారం, మంచినీరు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇక ఉదయం భక్తుల పూజా కార్యక్రమాలనంతరం సాయంత్రం 5:30 గం.లకు ప్రభోత్సవం, రాత్రి 7గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గం.లకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్ధరాత్రి పాగాలంకరణ, శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవం జరగనుంది.

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు