Minor Girl Killed: ప్రేమోన్మాది ఘాతుకం.. మైనర్ బాలిక గొంతుకోసి హత్య

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ ఉన్మాది మైనర్ బాలకను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటలో చోటు చేసుకుంది.

New Update
FotoJet (21)

Love addict murders minor girl

కడప జిల్లా(YSR Kadapa District) లో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ ఉన్మాది మైనర్ బాలకను కత్తితో గొంతు కోసి హత్య(minor girl killed) చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటలో  చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లాలోని ఖాజీపేట మండలం ఆంజనేయకోట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్ అనే యువకుడు, అదే మండలం ఖాజీపేట అగ్రహారానికి చెందిన ఓ బాలికను కొంతకాలంగా ప్రేమ(Love addict) పేరుతో వేధిస్తున్నాడు.

Also Read :  యమునా నదిలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 9 మంది మృతి

Minor Girl Killed His Lover

ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన(17) ఇంటర్‌ చదువుతుండగా.  ఆంజనేయులు కొట్టాలు గ్రామానికి చెందిన వెంకటేశ్ డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు, వెంకటేష్‌ కొంతకాలంగా కీర్తనను ప్రేమించమని వెంటపడుతున్నాడు.
 తన ప్రేమను ఒప్పుకుని, పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టడం మొదలు పెట్టాడు. అయితే అతని ప్రేమను అంగీకరించలేనని కీర్తన తెగేసి చెప్పడంతో.. కోపంతో రగిలి పోయిన యువకుడు ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.

శుక్రవారం నాడు బాలిక  ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ ఆమెపై దాడికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతు కోశాడు. ఆమె అరుపులు విని వెళ్లిన స్థానికులకు  తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలి ఉన్న బాలిక కనిపించింది. వెంటనే ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి చేరుకోకముందే బాలిక మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. ఉన్మాది చేతిలో బలికావడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కాగా,ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖాజీపేట పోలీసులు వెంటనే  స్పందించారు. పరారీలో ఉన్న ప్రేమోన్మాది ఆవుల వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య వార్త తెలియడంతో ఖాజీపేట అగ్రహారం, ఆంజనేయకోట్టాలు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.  

Also Read :  మోహన్ బాబుకు ఊరట... తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు

Advertisment
తాజా కథనాలు