Aghori News: వర్షిణిని, నన్ను అఘోరీ పెళ్లి చేసుకుంది.. లైవ్‌లో అఘోరీ బాగోతం బయటపెట్టిన హర్ష!

లేడీ అఘోరీ తనతో తిరుగుతున్న వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఆ యువతి అన్నయ్య ఆరోపించాడు. వర్షిణి మెడలో పసుపు తాడు కట్టిందని తెలిపాడు. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించిందని.. ముద్దులు పెడుతూ కొరికిందని అన్నాడు. తనను కూడా పెళ్లి చేసుకుందని ఆరోపించాడు.

New Update

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ.. ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. లేడీ అఘోరీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన శిష్యురాలిగా చెప్పుకుంటున్న బీటెక్ విద్యార్థిని వర్షిణి అన్నయ్యతో అఘోరీ అసభ్యకర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా వర్షిణి, అఘోరీ లవర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. క్షుద్ర పూజలు చేసి తమ కూతుర్ని అఘోరీ ట్రాప్ చేసిందంటూ వర్షిణి తల్లి ఆరోపణలు చేసింది. వీటన్నింటిపై అఘోరీ అండ్ వర్షిణి RTV లైవ్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు. 

‘‘నేను వర్షిణిని ట్రాప్ చేయలేదు. ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చింది. మంగళగిరి టోల్ ప్లాజ్ వద్ద వర్షిణి నన్ను కలిసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొత్తం 7 రోజులు ఉన్నాను. మొదటి సారి 3 రోజులు, ఆ తర్వాత మరో 4 రోజులు ఉన్నాను. వారు నన్ను బాగానే చూసుకున్నారు.’’ అని తెలిపింది. 

Also Read: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

అనంతరం వర్షిణి అన్నయ్యపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియోపై అఘోరీ స్పందించింది. అది కేవలం ఒక రీల్ కోసం చేసిన వీడియో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అంతేగాని అది ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కాదని తెలిపింది. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని.. అక్కడే వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చుకు ఉందని పేర్కొంది. అది కేవలం ఫన్నీ కోసం మాత్రమే జరిగిందని.. దానిని కావాలనే చెడుగా రూమర్ క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. 

బుగ్గలు కొరుకుతూ.. ముద్దులతో

దీనిపై వర్షిణి అన్నయ్య హర్ష మాట్లాడుతూ.. అది ఫన్నీ కోసం కాదని.. అఘోనీ తన బుగ్గలు కొరికిందని అన్నాడు. ముద్దులు కూడా పెట్టిందని తెలిపాడు. సెక్సువల్‌గా తన సాటిస్‌ఫేక్షన్ కోసం ఇలా చేసిందని ఆరోపించాడు. ఇలా చేసిన క్రమంలో తనకు మూడు వస్తుందని చెప్పి అఘోరీకి పక్కకి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. అఘోరీ ఎన్నో సార్లు తనను కొరికిందని.. బుగ్గలపై ముద్దులు కూడా పెట్టిందని అన్నాడు. 

Also Read: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

ఒక రోజు వర్షినిని తన ముందు కూర్చొబెట్టుకుని అఘోరీ మంత్రాలు, క్షుద్రపూజలు చేసిందని అన్నాడు. అంతేకాకుండా ఆల్కాహాల్, ఫుడ్ కోసం డబ్బులు ఇచ్చి షాప్‌లను పంపించేదని తెలిపాడు. అలాగే వర్షినికి బంగారం చైన్ కూడా అఘోరీ కొనిచ్చిందని చెప్పాడు. ఇవి మాత్రమే కాకుండా అఘోరీ మంగళసూత్రాలు కూడా తెచ్చిందని అన్నాడు.

పెళ్లి చేసుకుంది

చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళ సూత్రాలను అఘోరీ.. వర్షిని మెడలో కట్టి పెళ్లి చేసుందని అతడు ఆరోపించాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ లేడీ అఘోరీ తన మెడలో కూడా పసుపుతాడు కట్టింది అని వర్షిని అన్నయ్య పేర్కొన్నాడు. వర్షినితో పాటు తనను కూడా పెళ్లి చేసుకుందని సంచలన విషయాలు లైవ్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

(lady aghori | latest-telugu-news | telugu-news | breaking-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

New Update
Andhra Pradesh Secretariat second block VK

Andhra Pradesh Secretariat second block VK

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

పవన్ పేషీలో మంటలు

కాగా సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

Advertisment
Advertisment
Advertisment