TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి

కర్నూల్‌లో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. గుడికి వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.

New Update
kurnool murder

kurnool murder Photograph: (kurnool murder)

కర్నూల్‌లో టీడీపీ నేత శుక్రవారం రాత్రి దారుణంగా హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. అదే కాలనీలోని గుడికి వెళ్లి భజన పూర్తి చేసుకొని వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. నిందితుడు రామాంజనేయులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడు. వీరి కుటుంబాల మధ్య పాతకక్ష్యలు ఉన్నాయి. సంజన్న గతంలో వైసీపీలో ఉండి.. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణం ఆధిపత్య పొరని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Also read: Tamil Nadu Hindi controversy: పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం

ఎప్పటినుంటో రామాంజనేయులు, సంజన్న కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సంజన్న కుమారుడు జయరాం ప్రస్తుతం కార్పొరేటర్‌గా YSRCP పార్టీలోనే ఉన్నాడు. మాజీ కార్పొరేటర్‌ సంజన్న ఎన్నికల ముందు టీడీపీ పార్టీలోకి చేరాడు. 

Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: 10వ తరగతి విద్యార్థులకు అలెర్ట్.. పరీక్ష వాయిదా

ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

New Update
10th Class Exam

10th Class Exam

ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో మార్చి 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి అధికారులు సూచించారు. ఇదిలాఉండగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పులు జరగొచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Also Read: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!

మార్చి 17న పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 17న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 19న సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 21న ఇంగ్లీష్‌, 24న గణితం, 26న ఫిజిక్స్‌, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్‌ పరీక్షలు జరిగాయి. మార్చి 31న  జరగాల్సిన సోషల్‌ స్టడీస్‌ పరీక్ష రంజాన్ సందర్భంగా వాయిదా పడింది. 

Also Read: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్

Advertisment
Advertisment
Advertisment