Kurnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు!

ఏపీలోని కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటికి 45 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

New Update
Kurnool Tuggali mandal Jonnagiri private travel bus overturned

Kurnool Tuggali mandal Jonnagiri private travel bus overturned

Kurnool Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రమాదం సమయంలో అప్పటికి దాదాపు 45 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

కుంభమేళాకు వెళ్లి వస్తుండగా

ప్రమాదం జరిగిన అనంతరం స్థానికులు గమనించి గాయపడ్డవారిని అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ హాప్సిటల్ కు తరలించారు. అయితే మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ జరిగిన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ బళ్ళారి జిల్లాకు చెందిన వారిగా సమాచారం.

కుంభమేళాకు వెళ్తుండగా మరో ఘోరం

ఇదిలా ఉంటే యూపీ వారణాసిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో కుంభమేళాకు వెళ్తున్న జీపు మీర్జామురాద్ సమీపంలోని జిటి రోడ్డులో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటకకు చెందినవారే.. 

మృతులంతా కర్ణాటకకు చెందినవారని మీర్జామురాద్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అజయ్ రాజ్ వర్మ తెలిపారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Advertisment
Advertisment
Advertisment