/rtv/media/media_files/2025/02/04/XnDVsMRnB8kug4Ex9SL8.jpg)
gannavaram fire accident
Krishna District: కృష్ణ జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ విద్యార్థులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఆశ్రమంలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బయటకు తీసుకొచ్చారు. అయితే ఓ గదిలో మాత్రం ఆరుగురు విద్యార్థులు చిక్కుకుపోయారు. దీంతో సిబ్బంది తలుపులు పగలగొట్టి పిల్లలను బయటకు తీసుకొచ్చారు. అనంతరం గాయపడిన ఆ ఆరుగురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Also Read: Tejaswi Madivada: తేజస్వి అందాల విధ్వంశం.. క్రీమ్ కలర్ డ్రెస్ లో హీటేక్కిస్తున్న బ్యూటీ
140 మంది విద్యార్థులు
ఆ తర్వాత స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం సమయంలోఆశ్రమంలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణమేంటి అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Maha kumbh 2025: కుంభమేళాకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీలు.. ఫొటోలు వైరల్!