అలా అడిగినందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు. By Seetha Ram 21 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం బద్వేలులో ఇటీవల దారుణం జరిగింది. ప్రేమోన్మాది విఘ్నేష్ ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో 80 శాతం పైగా గాయపడిన ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి హాస్పిటల్‌కు తరలించారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ విద్యార్థిని(16) ఆదివారం మృతి చెందింది. Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది? 5 ఏళ్లు పరిచయం ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి నిందితుడు విఘ్నేష్‌ను శనివారమే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. కాగా ఆ విద్యార్థినిని నిందితుడు ఎందు కారణం చేత పెట్రోల్ పోసి నిప్పంటిచ్చాడో ఎస్పీ వెల్లడించారు. ఇంటర్ విద్యార్థినికి నిందితుడు విఘ్నేష్‌తో దాదాపు 5 ఏళ్లు పరిచయం ఉందని ఆయన అన్నారు. అయితే వారిద్దరూ శనివారం బద్వేలుకు దాదాపు 10 కి.మీ దూరంలో కాసేపు గడిపారని చెప్పారు. Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే? పక్కా ప్లాన్ ప్రకారమే ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అడగడంతో అప్పటికే పెళ్లైన విఘ్నేష్ అత్యంత కోపగ్రస్తుడై ఆమెతో గొడవ పడ్డాడని తెలిపారు. ఇందులో భాగంగానే పథకం ప్రకారమే పెట్రోల్ తీసుకొచ్చిన విఘ్నేష్.. కావాలనే ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై పోసి నిప్పంటించాడని అన్నారు. అయితే పక్కా ప్లాన్‌తో విఘ్నేష్ తన ఫోన్‌ను ఇంటిలో వదిలేసి.. తన భార్య ఫోన్‌ను వినియోగించాడని చెప్పుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, బాలిక వాంగ్మూలం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా.. కాగా ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ప్రేమోన్మాది పెట్రోల్ దాడి ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమన్నారు. Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే? ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించానని అన్నారు. అంతేకాకుండా నేరస్థుడికి మరణశిక్ష స్థాయిలో శిక్ష పడేలా చూడాలని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా రియాక్ట్ అయ్యారు. #ap-cm-chandrababu #kadapa #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి