BREAKING: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కళాశాలలు పునః ప్రారంభం

ఏపీలో జూనియర్ కళాశాలలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండ్ ఇయర్‌కు వచ్చిన స్టూడేంట్స్‌కు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసులు జరుగుతాయి.

New Update
Intermediate Colleges

Intermediate Colleges

ఏపీలో జూనియర్ కళాశాలలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండ్ ఇయర్‌కు వచ్చిన స్టూడేంట్స్‌కు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు క్లాసులు జరుగుతాయి. మళ్లీ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో NCERT సిలబస్‌ను తీసుకొచ్చారు. CBSE విధానాన్ని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షలు ముగిశాక ఏప్రిల్‌లో తరగతులు నిర్వహించి.. ఆ తర్వాత సమ్మల్ హాలిడేస్ ఇచ్చే నిబంధనను తీసుకొచ్చారు. 

Also Read: చైనాకు బిగ్ షాక్.. అమెరికా గ్రీన్ సిగ్నల్‌తో భారత్‌ వైపుకు 7 రష్యా చమురు నౌకలు

ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా రిలీజ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 రోజులు కళాశాలలు ఉంటాయి. విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకోవడం కోసం పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత, ర్యాంకుల గ్యారెంటీపై ప్రైవేటు జూనియర్ కాలజీలు ప్రచారం చేయకూడదని రంజిత్ బాషా ఆదేశించారు. ఇది చట్టవిరుద్ధమని హెచ్చరించారు. గోడలపై రాతలు, కరపత్రాల పంపిణీ, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో యాడ్స్‌ ఇవ్వరాదని స్పష్టం చేశారు.  

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...3 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌

సెలవులు

జూన్‌ 1న జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభం
త్రైమాసిక పరీక్షలు: అక్టోబరు 5 - 9 
దసరా సెలవులు: అక్టోబరు 10-20
అర్ధ సంవత్సరం పరీక్షలు:  నవంబరు 25-30 
సంక్రాంతి సెలవులు జనవరి:  9-17 
ప్రీఫైనల్‌ పరీక్షలు: జనవరి 19-23
సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు:- ఫిబ్రవరి  
థియరీ పబ్లిక్‌ పరీక్షలు:- ఫిబ్రవరి/మార్చి
2026-27: లాస్ట్ వర్కింగ్‌ డే మార్చి 18.

Advertisment
తాజా కథనాలు