/rtv/media/media_files/2025/02/27/uoaniSrJKIDju4IyxPYd.jpg)
Minister Nara Lokesh
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇరుపక్షాలు ఎంవోయుపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ''జర్మనీలో వృద్ధుల సంరక్షణ, హాస్పిటల్స్‌లో 3 లక్షలమంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉంది. యూరప్‌లో ముఖ్యంగా జర్మనీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో నర్సింగ్ చేసిన విద్యార్థినులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
/rtv/media/media_files/2025/02/27/olylevzooq6gY6ai8wZ6.jpg)
Also Read: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఈ శిక్షణ వల్ల ఏటా వెయ్యిమంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజితో ఉద్యోగాలు లభిస్తాయని'' అన్నారు. మరోవైపు స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ఉజ్వల్ చౌహన్ మాట్లాడుతూ ''తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 10 వేలమందికిపైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించాం. స్కిల్ బి అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ రిక్రూట్‌మెంట్ స్టార్టప్‌లలో ఒకటిగా ఉంది. జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నాం.
Also Read: ముగిసిన కుంభామేళా.. వారికి రూ. 10 వేల బోనస్.. సీఎం యోగి కీలక ప్రకటన
ఎపీఎస్ఎస్డీసీ భాగస్వామ్యంతో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎఎన్ఎం స్పెషలైజేషన్‌తో గ్రాడ్యుయేషన్ పొందిన నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇప్పిస్తాం. ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తాం. స్కిల్‌బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎపీఎస్ఎస్డీసీలు భాషా నైపుణ్య కొరతను పరిష్కరించి, ఏపిని నైపుణ్య రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, విశాఖపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4 వేలమందికి పైగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని'' తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ఎపీఎస్ఎస్డీసీ సిఈవో గణేష్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.