/rtv/media/media_files/2026/03/19/job-calender-released-in-andhra-pradesh-2026-03-19-10-36-08.jpg)
Job Calender Released in Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది సందర్భంగా 2026 జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వివిధ శాఖలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాశాఖలో ఎక్కువగా ఖాళీలు భర్తీ చేయనున్నారు. మే 15న విడుదలయ్యే నోటిఫికేషన్ ద్వారా ఉన్నత విద్యలో 1500 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15న హోంశాఖలో 2778 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక అక్టోబర్ 15న పాఠశాల, ఇంటర్ విద్యకు సంబంధించి 3,004 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
Also Read: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కళాశాలలు పునః ప్రారంభం
నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్ల ద్వారా వారి సమస్యకు పెద్దపీట వేయాలని ఆలోచనతో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్, గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1లో 91 పోస్టులు, గ్రూప్ 2లో 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ విభాగంలో 503 పోస్టులకు, ఇతర శాఖల్లో దాదాపు 1434 ఖాళీలకు నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.
Also Read: గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల దాడి..రంగంలోకి ఉక్రెయిన్ నిపుణులు
Follow Us