/rtv/media/media_files/2025/03/05/x6uaj5Z92QPuVopAf9Wy.jpg)
Nagababu Janasena MLC Candidate
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ఉన్నారు. గత ఐదేళ్లుగా నాగబాబు జనసేన పార్టీ కోసం విస్తృతంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనను అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దించాలని పార్టీ భావించింది.
Also Read : టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ @NagaBabuOffl గారి పేరు ఖరారు
— JanaSena Party (@JanaSenaParty) March 5, 2025
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు… pic.twitter.com/B4yBXjG96X
Also Read : ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
బీజేపీతో పొత్తు కారణంగా ఎంపీగా పోటీకి దూరం..
అయితే.. బీజేపీ (BJP) తో పొత్తు కుదరడంతో ఆ సీటును కూటమి నుంచి ఆ పార్టీకి కేటాయించారు. దీంతో నాగబాబు (Nagababu) ఆ సమయంలో పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం రాజ్యసభకు ఆయనను పంపిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో కుదరలేదు. దీంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీడీపీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నాగబాబుకుకు ఛాన్స్ వస్తుందని అంతా భావించారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత ఆయనను మంత్రిగా నియమిస్తారన్న ప్రచారం సాగింది.
Also Read : బందరులో ఘోరం.. గర్భిణి ప్రాణం తీసిన ఆస్పత్రి.. అసలేమైందంటే..?
మంత్రి అవుతారా? లేదా?
ఈ క్రమంలో ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ జనసేన (Janasena) ప్రకటన విడుదల చేసింది. అయితే.. నాగబాబు మంత్రి పదవిపై ఆసక్తి చూపడం లేదని నిన్నటి నుంచి కొత్త ప్రచారం మొదలైంది. దీంతో ఆయనకు ఏదైనా కీలక కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఖాయం కాగా.. మంత్రి పదవి చేపడుతారా? లేదా? అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : ఆన్‌లైన్ బెట్టింగ్‌లో మోసపోయిన సచివాలయ ఉద్యోగి.. RTV షేర్ చేసిన వీడియోకి స్పందించిన మంత్రి లోకేష్