/rtv/media/media_files/2025/03/14/mAIBCSTaDgUgLkZEeMh3.jpg)
Nagababu Original Name
కొణిదెల నాగబాబు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. మెగా బ్రదర్ గా, నటుడిగా, నిర్మాతగా, జబర్దస్త్ లాంటి టాప్ షోకు న్యాయ నిర్ణేతగా, ఇప్పుడు పొలిటీషియన్ గా ఆయన ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగిన నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన చట్టసభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే.. నాగబాబు అసలు పేరుపై ఇప్పుడు ఇంటర్ నెట్లో జోరుగా చర్చ సాగుతోంది. నాగబాబు/నాగేంద్రబాబుగా ఆయన తెలుగు ప్రజలకు ఇప్పటివరకు సుపరిచితుడు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం.
— Lalkrishna SARPANCH (@GundlapalliLal1) March 13, 2025
టీడీపీ నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ.
జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఏకగ్రీవ ఎన్నిక.#Congratulations#APMLC pic.twitter.com/VLtt3JWJtz
సర్టిఫికేట్లలోనూ అదే పేరు..
అయితే.. నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత విడుదలైన అధికారిక ప్రకటనలో నాగేంద్రరావు అని ఉండడం చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై ఆరా తీయగా నాగబాబు అసలు పేరు నాగేంద్రరావు అని తెలుస్తోంది. సర్టిఫికేట్లలోనూ నాగేంద్రరావు అనే ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇంట్లో ముద్దుగా నాగబాబు అని అంతా పిలవడంతో వాడుకలోనూ అదే ప్రచారంలోకి వచ్చినట్లు వారు వెల్లడిస్తున్నారు.
అయితే ప్రొడ్యూసర్ గా ఉన్న సమయంలోనూ నాగబాబు అనే పేరునే ఆయన టైటిల్స్ లో వేసుకున్నారు. దీంతో నాగేంద్రరావు అనే పేరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులకు తప్పా ఎవరికీ తెలియకుండా పోయింది. ఎన్నికల నేపథ్యంలో విడుదలైన అధికార ప్రకటన ద్వారా ఆయన అసలు పేరు నాగేంద్రరావు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆయన ఒరిజినల్ పేరు ప్రపంచానికి తెలిసిందన్న చర్చ సాగుతోంది.