పెన్ను వివాదం.. హాస్టల్ బిల్డింగ్‌ పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్!

ఏపీ పల్నాడు జిల్లాలో విషాద ఘటన జరిగింది. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలో భావన కాలేజీలో ఇంటర్ ఫస్ట్‌ఇయర్ చదువుతోంది. విద్యార్థులతో పెన్ను విషయంలో గొడవ జరిగింది. మనస్థాపం చెంది కాలేజీ హాస్టల్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

New Update

కొన్ని విషయాలు వినడానికి విచిత్రంగా అనిపిస్తాయి. చాలా చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలా అనేలా ఉంటాయి. క్షణకావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకువస్తాయి. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ విద్యార్థిని క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం తన ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదకరమైన ఘటన జరిగింది. పెన్ను విషయంలో తలెత్తిన గొడవ ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలో భావన కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అక్కడే ఒక ప్రైవేట్ కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

పెన్ను విషయంలో గొడవ

ఇవాళ ఉదయం హాస్టల్‌లోని మరో స్నేహితురాలితో పెన్ను విషయంలో అనూషకు గొడవ అయింది. దీంతో అనూష తీవ్ర మనస్థాపం చెంది హాస్టల్ ‌మీద నుంచి దూకేసింది. దాదాపు నాలుగో అంతస్తు నుంచి కిందికు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అందుకు సంబంధించిన వీడియో సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ ఘటన జరిగిన తర్వాత కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. 

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

దీంతో పోలీసులతో పాటు నరసరావుపేట ఆర్డీవో హేమలత, ఎంఆర్ఓ వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు అనూష మృతిపై తమకు అనుమానం ఉందని ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థిని ఆత్మహత్యపై కాలేజీ మేనేజ్‌మెంట్ సరైన సమాధానం చెప్పలేదని వారు ఆరోపించారు. ఇందులో భాగంగా హాస్టల్ ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంటికి వెళ్లారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతోందన్న చర్చ కూడా మొదలైంది. వేణుస్వామి వీరి పెళ్లి జరిపించనున్నారన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

New Update
Duvvada Srinivas Madhuri Venu Swamy

Duvvada Srinivas Madhuri Venu Swamy

దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జంట ఎంత ఫేమసో అందరికీ తెలిసిన విషయమే. వీరు ఎక్కడికి వెళ్లినా.. ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇద్దరికీ ఇప్పటికే వివాహాలు జరిగినా.. విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ విడాకులు మంజూరు కాగానే.. తాము వివాహం చేసుకుంటామని ఇప్పటికే వీరు అనేక ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి ఇటీవలే ఈ జంట హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ భారీ ఎత్తున వస్త్ర దుకాణం కూడా వీరు ప్రారంభించారు. ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇది కూడా చదవండి: AP Crime: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

వేణు స్వామి చేతుల మీదుగా..

తాజాగా దువ్వాడ శ్రీనివాస్-మాధురి వేణుస్వామి ఇంటికి వెళ్లడం మరింత చర్చనీయాంశమైంది. ఆప్యాయ సమావేశమంటూ దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. అయితే.. వివాహం కోసమే శ్రీనివాస్-మాధురి జంట వేణు స్వామిని కలిశారన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. వేణు స్వామి త్వరలోనే వీరి వివాహాన్ని జరిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై దువ్వాడ జంట ఎలా స్పందిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. 
ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 

duvvada-srinivas | divvela-madhuri | telugu-news | telugu breaking news 

Advertisment
Advertisment
Advertisment