బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై నిప్పంటించి ఏంచేశారంటే?

కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం జరిగింది. సెంచురి ఫ్లైవుడ్‌ కంపెనీ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు. ఆపై నిప్పటించారు. బాలిక కేకలు విన్న స్థానికులు మంటలను ఆర్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

New Update

కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం జరిగింది. సెంచురి ఫ్లైవుడ్‌ కంపెనీ సమీపంలో ఓ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఏకంగా ఐదుగురు నిందుతులు బాలికపై అత్యాచారం చేశారు. అత్యాచారం తర్వాత అటవీ ప్రాంతంలో విద్యార్థినికి నిప్పంటించారు.

ఇది కూడా చూడండి: సల్మాన్‌ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్

బాలిక పరిస్థితి విషమం

ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

దీంతో వెంటనే ఆ బాలిక కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. వెంటనే విద్యార్థినిని చికిత్స నిమిత్తం బద్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆ బాలిక బద్వేల్ సమీపంలోని దస్తగిరెమ్మ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఆరా

ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గోపవరం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో వెంటనే జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలో మరో ఘటన

అయితే ఇలాంటి ఘటనే రాష్ట్రంలో మరొకటి జరిగింది. తనతో చదువుకుంటూ స్నేహంగా ఉంటున్న అమ్మాయి తన ప్రేమ నిరాకరించిందని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే కక్షతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కర్నూల్ జిల్లా కేంద్రలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అశ్వినిని సన్నీ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: డిప్యూటీ కలెక్టర్​ పీవీ సింధు.. ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు

ఆమె నిరాకరించడంతో దారుణానికి ఒడుగట్టాడు. దీంతో పగ పెంచుకున్న సన్నీ.. అశ్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరబడ్డాడు. ఒంటరిగా ఉన్న అశ్విని నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పారిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అశ్వినిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు