AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదలుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ చెప్పింది.మూడు రోజుల పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

New Update
ap rains

ap rains

AP Rains: నైరుతి,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమ ద్రోణి..అల్పపీడనాన్ని ,తేమను తన వైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదలుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 

Also Read: అల్లు అర్జున్ పై కేసు వెనక్కి.. శ్రీతేజ్ తండ్రి సంచలన ప్రెస్ మీట్!

దానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో  రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు,నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

Also Read: EC: ఎలక్షన్ రూల్స్ మార్పుపై కాంగ్రెస్ ఫైర్.. సుప్రీంకోర్టులో పిటిషన్

పిడుగులు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం తరువాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు,తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోతేలికపాటి వర్షాలు కురిశాయి.

Also Read: నిలిచిపోయిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు ..తీవ్ర నిరాశలో ప్రయాణికులు

ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర...

చలిగాలులు వీచాయి.అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీరప్రాంత జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం,తుని,కాకినాడ,మచిలీపట్నం,నందిగామ,గన్నవరం ,బాపట్ల, ఒంగోలు, కావలి,నెల్లూరు,తిరుపతి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి.

Also Read: ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..ఒడిశా గవర్నర్‌‌గా కంభంపాటి హరిబాబు

అల్పపీడనం ప్రభావంతో గాలులు వీస్తాయంటున్నారు. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో చలి గాలులు వీస్తున్నాయి.. అలాగే మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో ఎండా, మంచు లేదు.. చలి గాలులతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.మరోవైపు బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏపీ ప్రజల్ని, మరీ ముఖ్యంగా రైతుల్ని వణికిస్తున్నాయి.

 ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రెండు, మూడు రోజుల అనంతరం బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 26 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా వరుస అల్పపీడనాలు, తుఫాన్‌ల  ప్రభావంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

గత నెల, ఈ నెలలో అల్పపీడనాలతో వరి రైతులు ఆందోళనలో ఉన్నారు.వర్షానికి ధాన్యం తడుస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వరి పొలంలో పంట ఉండటంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. మూడు రోజుల క్రితం అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిశాయి.అయితే ఈ వర్షాలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు