Tirumala: తిరుమలలో విషాదం..నడకదారిలో హైదరాబాద్‌ భక్తుడు మృతి!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన హైదరాబాద్‌ భక్తుడు రవి గుండెపోటుతో మరణించాడు.అలిపిరి నడకమార్గంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఒక్కసారిగా ఛాతినొప్పితో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.

New Update
TTD

Tirumala: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వయసుతో తేడా లేకుండా గుండెపోటు వస్తుంది. అప్పటి వరకు మనతో మాట్లాడిన వారే ఉన్నట్టుండి మన కళ్ల ముందే కూలిపోతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఇలాగే గుండెపోటుతో చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు మరింత పెరగడం ఆందోళన కలిగస్తోంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ క్రమంలోనే తాజాగా తిరుమల నడకమార్గంలో విషాదం చోటు చేసుకుంది.  హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఒకరు గుండెపోటుతో చనిపోయారు.స్నేహితులతో సరదా మాట్లాడుతూ.. తిరుమల నడక మార్గంలో వెళుతుండగా ఆయన హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే తిరుమలలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు.

Also Read: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా?

హైదరాబాద్‌ అమీర్‌పేట్‌కు చెందిన సీహెచ్‌ రవికుమార్‌ అనే యువకుడు ఐదుగురు స్నేహితులతో కలిసి.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం తిరుపతికి వచ్చారు.  తిరుపతి నుంచి అలిపిరి వచ్చి.. అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడకమార్గంలో పయనమయ్యారు.

Also Read: Rahul: నా మొదటి ప్రసంగం కంటే బాగుంది..ప్రియాంక స్పీచ్‌పై రాహుల్ స్పందన

స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ 2,500 మెట్లు ఎక్కేశారు.. అయితే రవికుమార్‌‌ ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా ఉందంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే స్నేహితులు ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇవ్వడంతో.. అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. బాధితుణ్ణి హుటాహుటిన తిరుమలలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ రవికుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు చెప్పారు.

Also Read: కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్య.. స్పందించిన విదేశాంగ శాఖ

దీంతో రవికుమార్‌ మృతదేహాన్ని తిరుమల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతూ రవికుమార్ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. విగతజీవులుగా మృతులు దృశ్యాలు ఉన్నాయి.

New Update

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

విగతజీవులుగా పడివున్న దృశ్యాలు

వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. ఇక ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారు హాస్పిటల్‌ ప్రాణాలతో పోరాడుతున్నారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే విగతజీవులుగా కనిపిస్తున్నారు. శరీరం మొత్తం కాలిపోయి విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. 

https://x.com/YSRCParty/status/1911354811322089657

fire accident | latest-telugu-news | telugu-news | viral-videos

Advertisment
Advertisment
Advertisment