/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
Hyderabad couple died in road accident in Tirupati district
Tirupati Road Accident
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన గన్ను మాధవకృష్ణ (48), సరిత సుమంగళి(43)గా గుర్తించారు. ఈ ఘటన పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట దగ్గర జరిగింది.
Also Read: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?
మరో ప్రమాదంలో 10మంది మృతి
ఇదిలా ఉంటే ఇలాంటి ఘోర ప్రమాదమే ఇవాళ మరొకటి చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ (Prayagraj- Mirjapur) హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నుంచి మహా కుంభమేళా(Maha Kumbh)కు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది.
Also Read : మస్తాన్ సాయికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు: ఇక జైల్లోనే!
ఈ ఘటనలో పది మంది భక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారే కాగా.. బస్సులో ఉన్నవారు 19 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులు. వివరాల ప్రకారం మృతులందరి వయస్సు 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, వారందరూ పురుషులేనని తెలుస్తోంది.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఈ సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా 33 రోజుల్లో 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మిగిలి ఉన్నాయి.