/rtv/media/media_files/2025/04/13/5UE20ps6SrLBtwJrewie.jpg)
Pastor Praveen Death GV Harsha Kumar Video
ప్రవీణ్ పగడాల మృతి ఆక్సిడెంట్ వల్ల కాదని నమ్ముతున్నాను.మొదటి నుంచి పోలీస్ ఆక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారు. ఆక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారు? Laptop, I pad ఎందుకు పోలీస్ లు పట్టుకెళ్లారు.విజయవాడలోనూ కొవ్వూరు లోను ప్రవీణ్ ను పిలిచినది ఎవరు? అసలు షెడ్యూల్ లో మహారాష్ట్ర పూణే వెళ్ళవలసి ఉండగా విజయవాడ,కొవ్వూరు లలో మీటింగ్ ల గురించి షెడ్యూల్ మార్చుకొన్నది నిజం కాదా? బండి ఆబ్జెక్ట్ కు గుద్దితే బండి పై కెగిరి ముందుకు పడాలి గానీ మనిషి మీద పెట్టినట్టు ఎందుకు ఉంది? ఇటువంటి నాన్సెన్ ఇన్వెస్టిగేషన్ లు చేసి మళ్ళీ వీటి మీద మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఎవర్ని బెదిరిస్తారు? అంటూ ధ్వజమెత్తారు.
Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?
Also Read: Gold Rates: అమ్మ బాబోయ్.. రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్ల పెరుగుదల.. 3 రోజులుగా పైపైకే
విజయవాడ, కొవ్వులో మీటింగ్ లకు పాస్టర్ ప్రవీణ్ ను ఎవరు పిలిచారు.. అన్న విషయాన్ని పోలీసులు ఎక్కడా ప్రస్తావించడంపై అనుమానం వ్యక్తం చేశారు. మీటింగ్ లకు వెళ్లే వ్యక్తి తాగి వెళ్తాడా? అని ప్రశ్నించారు. పోస్టుమార్టంలో మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు ఇప్పుడు చెప్పారన్నారు. ఈ విషయాన్ని పోస్టుమార్టం చేసిన వెంటనే ఎందుకు చెప్పలేదన్నారు. ప్రవీణ్ కు అసలు మద్యం తాగే అలవాటే లేదన్నారు. అంతకు ముందు ప్రవీణ్ మద్యం కొన్నట్లు ఫోన్ పేలో ఆధారాలు ఏమీ లేవా? అని ప్రశ్నించారు.
ప్రవీణ్ హత్య వెనుక కేంద్ర హోం శాఖ..
మద్యం కొన్నది వేరే వాళ్ల కోసం కూడా కావొచ్చన్నారు. ఎంత తాగుబోతు అయినా కూడా అన్ని రకాల మద్యాలు తాగి బండిని నడిపే అవకాశం లేదన్నారు. పోలీసులు అసలు హత్య కోణంలో విచారణే జరపలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ హోం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన హత్య ఇదన్నారు. వక్ఫ్ బోర్డ్ పని అయిపోయిందన్నారు.. నెక్ట్స్ టార్గెట్ క్రిస్టియన్లేనన్నారు. అయితే.. ఈ విధంగా తమను టార్గెట్ చేస్తారని తాము అనుకోలేదన్నారు. తప్పకుండా తాను ప్రవీణ్ డెడ్ బాడీని రీపోస్టుమార్టం చేయిస్తానన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను ఎలా భయపెడుతున్నారో తనకు తెలుసన్నారు. ఈ విషయంలో తాను ఎవరినీ రెచ్చగొట్టడం లేదన్నారు.
(Harsha Kumar | telugu-news | telugu breaking news | Pastor Praveen | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | andhra-pradesh-politics)