AP Crime: పల్నాడులో రియల్ ఎస్టేట్ మర్డర్.. తండ్రీకొడుకులను నరికి నరికి!
పల్నాడు జిల్లాలో పట్టపగలే తండ్రకొడుకులను దారుణంగా హత్య చేశారు. వీరిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
పల్నాడు జిల్లాలో పట్టపగలే తండ్రకొడుకులను దారుణంగా హత్య చేశారు. వీరిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంపై వైసీపీ నేత అంబటి రాంబాబు షాకింగ్ ట్వీట్ చేశారు. "సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలి" అని ట్వీట్ చేస్తూ, పవన్, నాగబాబులను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
భార్య, ఆమె బంధువులు భర్తని చంపి పార్సల్ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణని ఆయన బంధువులే దారుణంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు.
ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బులు పంచుకునేందుకు 7 ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసినట్లు సిట్ అధికారులు చార్జ్షిట్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఆరు, ఏపీలో ఒక ప్రాంతంలో డెన్లను గుర్తించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల వచ్చే ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. దీంతో అటువైపుగా వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి ఆమెను తన కారులో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు
ఇంటిని వదిలి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వార్డెన్ బరితెగించింది. తాను కూడా ఓ మహిళనే అన్న విషయాన్ని కూడా మరిచి సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.