Kavati Manohar Naidu : గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా..రెడ్‌ బుక్ రాజ్యాంగంలో పనిచేయలేనంటూ....

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్‌లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని వాపోయారు. ఈ అవమానాలు, ఎదుర్కొనేంత ఆత్మస్థైర్యం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Kavati Manohar Naidu :

Kavati Manohar Naidu :

Kavati Manohar Naidu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపించారు. ఈ సందర్భంగా తను రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించారు. కార్పొరేషన్‌లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని వాపోయారు. ఈ అవమానాలు, నిందలు, పరాభవాలను ఎదుర్కొనేంత ఆత్మస్థైర్యం తనకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎదుర్కొన్నటువంటి అవమానాలు, పరాభవాలు కార్పొరేషన్ చరిత్రలో ఏ మేయర్ గానీ, ఏ ఛైర్మన్ గానీ అనుభవించి ఉండరని వాపోయారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటోన్నానని మనోహర్ నాయుడు చెప్పారు.నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్ని కష్టాలు పెట్టినా వైఎస్ జగన్‌తోనే ఉంటానని ప్రకటించారు.   

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎన్నికయ్యారు. ఇంకో ఏడాది కాలం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఈలోపే ఆయన తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన రాజీనామాకు ప్రధాన కారణం- కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ వ్యవహారశైలేనని చెబుతున్నారు. కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం, జనసేన తీర్థం పుచ్చుకోవడం వల్ల స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఆ రెండు పార్టీలకే దక్కాయి. ఈ కమిటీకి మేయరే ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్నారని, ఆయినప్పటికీ- ఆయనకు సమాచారం ఇవ్వట్లేదని తెలుస్తోంది. 

 Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్

అదే సమయంలో ఈ నెల 17వ తేదీన స్టాండింగ్ కమిటీ సమావేశం జరుగబోతోంది. ఇందులో కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాసం తీర్మానం సైతం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీలో మెజారిటీ స్థానాలు లేకపోవడం వల్ల ఈ తీర్మానం నెగ్గడం లాంఛనప్రాయమేనని, అందుకే కావటి రాజీనామా చేశారని అంటున్నారు. స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఈ సమావేశాన్ని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే నిర్ణయాధికారం మనోహర్ నాయుడికే ఉంటుంది. ఆ ప్రొటోకాల్‌ను సైతం అధికారులు పాటించట్లేదని ఆయన చెప్పారు. తన ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తోన్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.

Also Read: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు