Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!

‘ఆయుర్వేద చాక్లెట్లు తింటే సకల రోగాలు సర్వ నాశనం అవుతాయి’ అని కవర్‌పై రాసి మరీ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

New Update
Ganja Laced Chocolates

ఇదొక కొత్త రకమైన మోసం. ఆయుర్వేద చాక్లెట్లు అంటూ కవర్‌పై రాసి అమ్మడం ప్రారంభించారు. ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు సర్వ నాశనం అవుతాయని.. రోగ నిరోధక శక్తిలా పనిచేస్తాయని ప్రచారం చేశారు. తీరా చూస్తే అవి గంజాయి చాక్లెట్‌లు. ఈ విషయం తెలియక చాలా మంది. ఒక్కసారి తిన్న వారు మళ్లీ మళ్లీ అవే చాక్లెట్లు కావాలంటూ అడగడం మొదలు పెట్టారు. ఒకసారి తింటే మసనంతా అటే లాగేస్తుండటంతో పదే పదే అవే కావాలంటూ బానిసలయ్యారు. 

Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస

గంజాయి చాక్లెట్లు

దీంతో ఈ చాక్లెట్లు ఎందుకు ఇలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒక్కసారి తిన్నవారు పదే పదే అవే చాక్లెట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు అని ఆరా తీస్తే అవి ఆయుర్వేదంతో చేసిన మందులు కావని.. గంజాయి చాక్లెట్లని గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు చేశారు. 

Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ కె.రవీందర్‌ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ సిబ్బంది సోమవారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని పూరి జిల్లాకు చెందిన ఉమాచంద్ ఉపాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాడు. నాలుగు నెలల క్రితం వచ్చిన అతడు చిలకలూరి పేట - కోటప్పకొండ వెళ్లే దారిలో యూటీ గ్రామానికి వచ్చాడు. అక్కడే ఒక పాన్ దుకాణం పెట్టాడు. 

Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..

ఇక ఎప్పుడుబడితే అప్పుడు తన ఊరికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆయుర్వేద ఔషధం పేరుతో ‘సెవెన్ మినార్’ అనే గంజాయ్ చాక్లెట్లు తెచ్చి అమ్మేవాడు. ఈ చాక్లెట్లలో దాదాపు 14 గ్రాముల గంజాయి కలుపుతున్నట్లు తేలింది. అయితే ఒక్కో చాక్లెట్‌ను 40 రూపాయలకు అమ్మడంతో మంచి లాభాలు పొందాడు.

దీంతో తన వ్యాపారం మరింత విస్తరించాలని.. చాక్లెట్ ప్యాకెట్లలో 10 గ్రాముల ఎండు గంజాయిని పెట్టి రూ.200లకు అమ్మడం ప్రారంభించాడు. ఇక సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు దారులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అరెస్టు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.  రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని..  వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు.

New Update

మాజీమంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.  రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని..  వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఈ కామెంట్స్ చేశారు.  టీడీపీ నేతలు తమపై కక్ష పెట్టుకోవద్దంటున్నారు.. అది మాత్రం జరగదు..  ఎవర్నీ వదలమని తెలిపారు.  గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడుతామని...  గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతామన్నారు.  మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరమేనని తెలిపారు.  గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి మరి నరికిపారేస్తామని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో  కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment