ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు రియాక్ట్ అయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.
Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
త్వరగా కోలుకోవాలి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మార్క్ శంకర్ తో పాటు మరెంతో మంది చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల నుంచి కూడా మిగతా పిల్లలు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరిపై కాళిమాత ఆశిస్సులు, శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
ఈ ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడి గురించి తాను స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అందుకే నేను స్పందిస్తున్నాను. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. రాజకీయ బురద చల్లకండి. సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా నేను స్పందిస్తాను. వాళ్ల కుటుంబాలకు ఏమైనా నేను స్పందించి రక్షిస్తాను.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి. మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. మీరు సరదాగా మీ కుమారుడితో సమయాన్ని గడిపే రోజులు వస్తాయి. నా వంతు నేను కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరేం బాధపడకండి. మీరు సనాతన ధర్మం గురించి పోరాడండి.
Also Read: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
(lady aghori | Pawan Kalyan | pawan kalyan son mark shankar | latest-telugu-news | telugu-news)