హైదరాబాద్‌లో విమానం నడిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి!

వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆకాశంలో ప్రైవేట్ జెట్‌ను నడిపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న తాను కన్న కల నెరవేరిందని.. ఆఫీషియల్‌‌గా పైలట్ నడిపినట్లు తెలిపారు. ఫస్ట్ సోలో ఫ్లైయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇదేనని పోస్ట్ చేశారు.

New Update
Former MLA Ketireddy

Former MLA Ketireddy Photograph: (Former MLA Ketireddy)

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైదరాబాద్‌లో విమానం నడిపారు. ఆకాశంలో విహరిస్తూ హైదరాబాద్ అందాలను చూశారు. మొదటి ఒక ప్రైవేట్ జెట్‌ను నడిపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న తాను కన్న కల నెరవేరిందని.. ఆఫీషియల్‌‌గా పైలట్ నడిపినట్లు, ఫస్ట్ సోలో ఫ్లైయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇదేనని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే తన ప్రయాణంలో మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కూడా కృతజ్ఞతలు అని తెలిపారు.

ఇది కూడా చూడండి: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!

ఇది కూడా చూడండి:  Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే

గతేడాది ఎన్నికల్లో పోటీ చేసి..

ఇదిలా ఉండగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మొదటిసారిగా 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019లో ధర్మవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేతిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇది కూడా చూడండి: Kumar Sangakkara : 51 ఏళ్ల బ్యూటీతో 47 ఏళ్ల కుమార సంగక్కర డేటింగ్!

ఇది కూడా చూడండి:  Ram Charan Daughter: వావ్..! అమ్మ, నానమ్మతో క్లింకార ఎంత ముద్దుగా పూజ చేస్తుందో.. ఉపాసన వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

New Update
Andhra Pradesh Secretariat second block VK

Andhra Pradesh Secretariat second block VK

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

పవన్ పేషీలో మంటలు

కాగా సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

Advertisment
Advertisment
Advertisment