/rtv/media/media_files/2025/03/14/ZL0cQCIX4DkPHFbH9dTY.jpg)
Ambati Rambabu - YCP
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు అయింది. అంబటికి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించి ఆయన బయటకు వస్తారని భావిస్తున్న సమయంలోనే, పట్టాభిపురం పోలీసులు గతంలో నమోదైన మరో కేసులో ( పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు) ఆయనను పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరిచారు.
ఫిబ్రవరి 1న పోలీసులు అరెస్టు
ఈ రెండో కేసును విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు, అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు (ఫిబ్రవరి 22 వరకు) రిమాండ్ విధించింది. అంబటి రాంబాబుపై ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 36 కేసులు నమోదైనట్లు సమాచారం. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనను ఫిబ్రవరి 1న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి ఆయన రాజమహేంద్రవరం జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.మొత్తానికి, ఒక కేసులో బెయిల్ దొరికినా మరో కేసులో రిమాండ్ పడటంతో అంబటి రాంబాబును పోలీసులు తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నారు.
Follow Us