AP: ప్రముఖ పాశ్రామిక వేత్త జనార్దనరావు దారుణ హత్య...

వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలమాటి జనార్ధన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. తన మనుమడి చేతిలోనే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తి తగాదాల కారణంగా మనుమడు తాతను 73 సార్లు కత్తిపొడిచి చంపాడు. 

New Update
AP

Industrialist Velamati Janardhan Rao

ఆస్తి తగాదాలు ఎంతటి వారి ప్రాణాలకైనా ముప్పే. తాజాగా ఇదే కారణంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త  వెలమాటి జనార్ధన్ రావు ఇదే ఆస్తి గాదాల నేపథ్యంలో తన మనుమడి చేతిలోనే దారుణ హత్యకు గురైయ్యారు. రెండో కూతురు కొడుకైన  కిలారు కీర్తితేజ తన తాతను ఏకంగా 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు. హైదరాబాద్‌ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటుచేసుకోగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 

అసలేం జరిగిందంటే...

ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్‌రావు కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఉంటున్నారు. రీసెంట్ గా  తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్‌ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. అదే సమయంలో మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. అయితే రెండో కూతురు, అతని కొడుకు దీంతో సాటిస్ఫై అవలేదు. కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు.  ఇందులో భాగంగానే గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి జనార్ధన్ రావు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తన తల్లిని టీ తెమ్మని చెప్పి వంటింట్లోకి పంపించి తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్ధన్ రావును 73 సార్లు పొడిచేశాడు కీర్తి తేజ. తండ్రి కేలు విన్న కూతురు సరోజినీ దేవి కొడుకుని ఆపబోయింది. అయితే అతను తన తల్లి మీద కూడా అటాక్ చేశారు. ఆమెను నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావొద్దని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు...వెంటనే కేసు నమోదు చేసుకుని కీర్తితేజను వెతికి పట్టుకున్నారు. అతన్ని పంజాగుట్టలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  మరోవైు కత్తిపోట్లకు గురై సరోజినీ దేవి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కీర్తితేజ మాదకద్రవ్యాలకు బానిసనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జనార్ధన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రూ.40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్ల విరాళాలు ఇచ్చారు. 

Also Read: Delhi Elections: ఓటమి...గెలుపు...రెండిటికీ ఆయనే కారణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్ పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
AB Venkateswara Rao

AB Venkateswara Rao

AB Venkateswara Rao :గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత కులాల మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి ,ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం..పెద్ద ఉపద్రవం వైయస్ జగన్, ఆయన  వైయస్సార్ పార్టీ అన్నారు. సమాజానికి పెద్ద ప్రమాదం వైఎస్ జగన్ అని, ఆయన పాలనలో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి, ప్రజాస్వామ్య విలువలు విధ్వంసం అయ్యాయన్నారు.

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతు నేను పని చేస్తానని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు వద్దు అని ప్రజలు నిశ్చయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు..బలహీనులు,బాధితులకి సాయం చేయడం కోసం వాళ్లకి అండగా ఉండడం కోసం అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం తప్పులు సరిదిద్దడానికి ప్రజల ఆలోచనలను నాకు జ్ఞానం ఉన్నంతవరకు అవగాహన చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశారు.

  Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్


నా దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతుల్ని అవగాహన చేసుకుని జరిగినటువంటి తప్పులను సవరించుకొని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ ఒక మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర పోషించడమే అన్నారు.రాజకీయాలంటే పదవి, అధికారము రాజకీయం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రాజకీయాలంటే అరాచకం అడ్డొచ్చిన వాళ్ళని అణిచివేయడం అని వెల్లడించారు.ప్రజల్ని కులాలు ,మతాలు, ప్రాంతాలు వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకరు ఎగదోసి ఆ సందర్భంలో తన దోపిడీని  కొనసాగించుకోవచ్చని మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

Advertisment
Advertisment
Advertisment