Ketireddy: గెస్ట్‌హైస్‌ వివాదం.. హైకోర్టులో కేతిరెడ్డికి ఊరట

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గెస్ట్‌హౌస్ వివాదంలో న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. శ్రీసత్యసాయి జిల్లాలో గుర్రాల కొండపై కేతిరెడ్డికి చెందిన 2.42 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.

New Update
EX MLA Keti reddy

EX MLA Keti reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గెస్ట్‌హౌస్ వివాదంలో న్యాయస్థానం స్టేటస్ కో విధించింది.  ఇక వివరాల్లోకి వెళ్తే..  శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ధర్మవరం చెరువు ప్రాంతంలో ఉన్న గుర్రాల కొండపై 2.42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నెంబర్ 905-2లో 2.42 ఎకరాలు ఆయన సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయ్యింది. 

Also Read: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

1960లో ఈ భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు ధర్మవరం మండలం మోటుమర్లకు చెందిన అంకే నారాయణ, లక్ష్మీచెన్నకేశవపురానికి చెందిన ఓబులమ్మ, రామగిరి మండలం శ్రీహరిపురానికి చెందిన తలారి అంజినమ్మలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయితే వాళ్లు ఈ భూమిని గాలి వసుమతికి అమ్మేసి రిజిస్టర్ చేయించారు. వాస్తవానికి ప్రభుత్వం వ్యవసాయం చేసుకునేందుకు ఇచ్చిన భూమిని అమ్మేసేందుకు పర్మిషన్ లేదు. దీంతో ఈ భూమిని అమ్మిన ముగ్గురికి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు.  

Also Read: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ

అలాగే ఈ భూమిని కొన్న గాలి వసుమతికి కూడా రిజిస్టర్ పోస్ట్‌ ద్వారా నోటీసులు పంపించారు. కానీ ఆమె నోటీసు తీసుకోకపోవడంతో అది తిరిగి వచ్చింది.  దీంతో గుర్రాలకొండ వ్యవసాయ క్షేత్రంలోని ఆ ప్రభుత్వ భూమిని గుర్తించి, స్వాధీనం చేసుకోవాలని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో అధికారులు భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళ్లగా.. గేటుకు తాళాలు వేసి ఉండటంతో వెనక్కి వచ్చేశారు. చివరికీ ఈ గెస్ట్‌హౌస్‌ స్థల వివాదంపై కేతిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేతిరెడ్డి పిటీషన్‌పై హైకోర్టులో తీర్పు వచ్చాక రెవెన్యూ అధికారులు స్థలంలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే తాజాగా కోర్టు దీనిపై స్టేటస్ కో విధించింది. అంటే కోర్టు తుది నిర్ణయానికి వచ్చేవరకు ఈ వివాదంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా యథాతథ స్థితిని కొనసాగించాలి.  

 telugu-news | rtv-news | ketireddy | former-mla-ketireddy-peddareddy | andhra-pradesh 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment