/rtv/media/media_files/2025/01/29/ijA2hWJs5Cv3peT3TYPp.jpg)
Minister Lokesh Meeting
ఆంధ్రాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మార్చాలని మంత్రి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. అన్నిటి కంటే విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని...స్టూడెంట్స్ ఆడుతూ పాడుతూ చదువుకునే చేయాలని లోకేశ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంతకు ముందు టెక్స్ట్ బుక్స్ తగ్గించాలని సూచించారు. అన్ని సబ్జెక్టుకు కలిపి ఒకే టెక్స్ట్ బుక్ తేవాలని చెప్పారు. ఇప్పుడు ప్రతీ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని మంత్రి లోకేశ్ అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు కో-కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు.
ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!
అన్నింటికీ కలిపి ఒకే యాప్..
దీంతో పాటూ టీచర్లకు ఇప్పుడున్న బోలెడు యాప్ లను తీసేసి...దాని స్థానంలో ఒకటే యాప్ ను రూపొందించాలని చెప్పారు. ఈ యాప్ ను అత్యంత తొందరగా రూపొందించాలని..విద్యార్థుల స్కూళ్ళల్లో అసలెంత మంది ఉన్నారో నిర్ధారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో-117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి...తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని లోకేశ్ కోరారు. మంత్రి నిర్వహించిన సమీక్షకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు హాజరయ్యారు.
ఇది కూడా చూడండి: Cinema: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం..ఫిల్మ్ ఛాంబర్