/rtv/media/media_files/2026/03/01/nellore-ggh-2026-03-01-20-39-16.jpg)
Nellore GGH
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, వార్డులోని ఎయిర్ కండిషనర్ (AC)లో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా దట్టమైనపొగలు రావడంతో వార్డు మొత్తం దట్టంగా విస్తరించింది. దీంతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆ సమయంలో వార్డులో సుమారు 15 నుండి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. పొగను గమనించిన వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న రోగులను స్ట్రెచర్ల ద్వారా సురక్షితంగా పక్కనే ఉన్న ఇతర వార్డులకు తరలించారు.
ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే ఆసుపత్రి సిబ్బంది ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చింది.ఈ ప్రమాదంలో ఏసీ యూనిట్, కొన్ని వైద్య పరికరాలు కాలిపోయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలోని పాత వైరింగ్, ఏసీల నిర్వహణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆక్సిజన్ సిలిండర్లను మరియు వెంటిలేటర్లపై ఉన్న రోగులను త్వరగా తరలించడంతో భారీ ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us