Fireworks Burst : బాణసంచా పేలుడుతో ఏడుగురికి తీవ్రగాయాలు!
అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిలో ఒకరు పరారీలో ఉన్నారు.
AP: ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
కాకినాడ జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం వల్ల రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. రాజుపాలెం కాలనీతోపాటు 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు.
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ సోమవారం పలు జిల్లాల పాఠశాలలకు సెలవు ప్రకటించింది. పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల్లో స్కూల్స్ బందు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు.
ఏపీలో ఘోర ప్రమాదం తప్పింది. 50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోర్నగూడెం దగ్గర ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణనష్టం లేకపోగా పలువురు గాయపడ్డారు.
AP: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరు దాటాక బయటకు ఒంటరిగా రావద్దని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే 1800 4255 909 నెంబర్కు కాల్ చేయాలని కోరారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.