Kodali Nani: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

కొడాలి నానికి సర్జరీ చేయనున్న డాక్టర్ రామకాంత పాండా చాలా ఫేమస్. ఆయన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా ఆయనే విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న వారిని సైతం బతికించి దేవుడయ్యారు.

New Update
Kodali Nani

Kodali Nani

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అక్కడ ఆయనకు మెరుగైన చికిత్స అందించనున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

అయితే ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించడం వెనుక ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అసలు అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు?.. ఇక్కడ డాక్టర్లు లేరా?.. అక్కడి డాక్టర్ అంత స్పెషలా?.. ఆ డాక్టర్ రికార్డ్స్ ఏంటి?.. ఇంతక ముందు ఎంతమందికి హార్ట్ సర్జరీలు చేశారు?.. పెద్ద పెద్ద ప్రముఖులకు హార్ట్ సర్జరీలు చేశారా? లేదా?.. అని చాలా మంది ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అనంతరం ఆయన రికార్డ్స్ చూసి అవాక్కవుతున్నారు. ఆయన వద్ద హార్ట్ సర్జరీలు చేయించుకున్న ప్రముఖుల లిస్ట్ చూసి ఖంగుతింటున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

డాక్టర్ రికార్డ్స్ ఇవే

ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్. రమాకాంత మదన్మోహన్ పాండా. ఈయనే కొడాలి నానికి ట్రీట్మెంట్ చేయనున్నారు. ఈయన ట్రాక్ రికార్డ్స్ చూస్తే వావ్ అనాల్సిందే. కొన్ని వేలమందికి ట్రీట్మెంట్ అందించారు. క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లను సైతం ఆయన బతికించి ప్రాణాలతో బయటపడేశారు.

ఈయన ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లా, దామోదర్‌పూర్‌ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 3, 1954న జన్మించారు. ఒక రైతు కొడుకు. ఆయన MBBS చేయడానికి కటక్‌లోని SCB మెడికల్ కాలేజీలో చేరాడు. 1980 - 1985 మధ్య AIIMS ఢిల్లీలో శస్త్రచికిత్స, గుండె శస్త్రచికిత్సలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆపై తన ఫెలోషిప్ కోసం USAలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో చేరారు. అక్కడితో ఆగకుండా ఆయన UKలోని హేర్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో కార్డియాక్ సర్జన్ ఫ్లాయిడ్ లూప్, ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ మాగ్డి యాకౌబ్ కింద శిక్షణ తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అంతేకాకుండా డాక్టర్ రమాకాంత్ పాండా భారతదేశంలో "టోటల్ ఆర్టరీ రివాస్కులరైజేషన్"ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అలాగే "ఆఫ్-పంప్" బైపాస్ సర్జరీ, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ( CABG ), బీటింగ్ హార్ట్ సర్జరీ, రీడూ బైపాస్ సర్జరీ, వాల్వ్ రిపేర్, కాంప్లెక్స్ అనూరిజమ్స్ (హై-రిస్క్ సర్జరీలు) మార్గదర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. 

రామకాంత పాండా.. MCh, ఒక కార్డియాక్ సర్జన్. అంతేకాకుండా కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీకి చీఫ్ కన్సల్టెంట్ కూడా. డాక్టర్ పాండా 2002లో ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌ను స్థాపించారు. దాదాపు 30,000లకు పైగా విజయవంతమైన కార్డియాక్ సర్జరీలను చేశారు. వీటిలో 2,000 కంటే ఎక్కువ రెడూ సర్జరీలు, 6,000+ హై-రిస్క్ సర్జరీలు ఉన్నాయి. 

పద్మభూషణ్

ఆయన సేవలకు గానూ 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. బైపాస్ సర్జరీలో 99.8% విజయం సాధించడంతో ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్డియాక్ సర్జన్‌గా గుర్తింపు పొందారు. అతడు ఎంతో మంది రాజకీయ దిగ్గజాలకు సైతం సర్జరీలు నిర్వహించారు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

ప్రముఖ దిగ్గజాలకు సర్జరీ

2009లో అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. అంతేకాకుండా దీని తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ , అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, నరసింఘ మిశ్రా, పాండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు డి రాజా, రాజీవ్ శుక్లా, కొనకళ్ల నారాయణ , రఘురామకృష్ణంరాజు లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. వీరితో పాటు అనేక మంది భారత రాజకీయాల నాయకులకు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేశారు. 

(kodali nani | kodali nani aig hospital | kodali nani health update | latest-telugu-news | Dr. Rama Kanta Panda | andhra-pradesh)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

New Update
Andhra Pradesh Secretariat second block VK

Andhra Pradesh Secretariat second block VK

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

పవన్ పేషీలో మంటలు

కాగా సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

Advertisment
Advertisment
Advertisment