సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేస్తున్నారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వాళ్లతో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభలో అన్నారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళ చేస్తున్నారని..సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని స్పష్టం చేశారు.

New Update
pawan 2

తిరుపతి వేదికగా గురువారం నిర్వహించిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వాళ్లతో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చానని పేర్కొన్నారు. ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు. '' అన్ని ఓట్ల కోసమే చేస్తామా ? ఓట్ల కోసమే మాట్లాడుతామా ? నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగినప్పుడు బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది సరిదిద్దండి అని గతంలోనే చెప్పాను. పట్టించుకోలేదు. అందుకే వాళ్లు 11 సీట్లకు పరిమితమయ్యారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇతర మతాలను చూసి మనం నేర్చుకోవాలి. సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉంది. మనకు గౌరవం ఇవ్వడం లేదు. 

సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామంటున్న వారితో గొడవ పెట్టుకునేందుకే వచ్చాను. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఇక్కడికే రాలేదు. హిందువుగా, భారతీయుడిగా వచ్చాను. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్తిత్త దీక్ష చేపడితే అవహేళన చేశారు. తిరుమలకు వెళ్తే నా కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించాను. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళ చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా. 

Also Read: రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే!

హిందూ దేవుళ్లపై దేశంలో చాలా దాడులు జరిగాయి. రాముడిని తిడితే నోరెత్తకూడదు. మనది లౌకిక దేశం అంటారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుళ్లను తిడితే ఇలాగే వదిలేస్తారా ? లౌకికవాదం పేరుతో హిందువుల నోర్లు నొక్కేస్తున్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదు. సనాతన ధర్మంపై సూడో సెక్యులరిస్టులు విమర్శలు చేస్తున్నారు. హిందూ దేవుళ్లను, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్లు ఎక్కువయ్యారు. బంగ్లాదేశ్‌.. ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా కూడా ఎవరూ మాట్లాడరు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొందరు అనుకుంటున్నారని'' పవన్ కల్యాణ్ అన్నారు. 

మరోవైపు పవన్ కల్యాణ్‌ వారాహి డిక్లరేషన్‌ కూడా ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలు ఇవే
1) ఏ మతానికి, ఏ  ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి.
2) సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి. 
3) సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
4) సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5) సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6) ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
7) ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు