Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు.

New Update
liquor

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం పాలసీని పూర్తిగా మార్చేసి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నాణ్యమైన బ్రాండ్ల మద్యం దొరకడంతోపాటు ధరలు కూడా కొంచెం తగ్గడంతో మందుబాబులు సంతోషంగా ఉన్నారు. ఇక గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడవగా.. ప్రస్తుతం మాత్రం ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు ఇవ్వడం జరిగింది.

Also Read: Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం

అంతేకాకుండా కొత్త బ్రాండ్లను తొలిగించి.. అంతకుముందు ఉన్న బ్రాండ్లను మళ్లీ తీసుకొచ్చారు. అంతేకాకుండా 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్.. ఆ తర్వాత దాన్ని అమలు చేసింది. ఈ రూ.99 క్వార్టర్‌కు మందుబాబుల నుంచి మంచి గిరాకీ ఉన్నట్లు మద్యం షాపు వర్గాలు అంటున్నాయి.

అయితే తాజాగా సంక్రాంతి పండగ వేళ.. మందుబాబులకు మద్యం కంపెనీలు మరో భారీ శుభవార్తను మోసుకొచ్చాయి. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా.. వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించిన విషయం తెలిసిందే. మరో 6 కంపెనీలు కూడా తాజాగా ధరలు తగ్గించాయి. మరోవైపు.. మద్యం ధరలను తగ్గించి.. విక్రయాలను మరింత పెంచుకోవాలని మద్యం కంపెనీలు అనుకుంటున్నాయి.

Also Read: Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్‌ బర్గ్‌!

ఇక ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్ మద్యం ధరలను తగ్గించటంతో ఇతర కంపెనీల పైనా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ కంపెనీలు కూడా ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల మద్యం అమ్మకాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపినా.. బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. 

ఫలితంగా మద్యం విక్రయాలపై అధికారుల నిఘా పెరిగింది. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మాన్షన్‌ హౌస్‌ కంపెనీ.. ఒక్కో క్వార్టర్‌పై రూ.30 తగ్గించింది. అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 మేర తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.10 వరకు తగ్గింది.

బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి రూ.80 తగ్గించుకునేందుకు వీలుగా దరఖాస్తు చేసింది. అయితే.. ఇలా కంపెనీలు ధరలు తగ్గించడం మాత్రం ప్రభుత్వానికి కొంత ఎదురుదెబ్బగా మారింది. ధరల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మందుబాబులకు మాత్రం ధరల తగ్గింపు అనేది కిక్ ఇచ్చే వార్త అని పేర్కొంటున్నారు.

Also Read: ఆన్‌లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్

Also Read: Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ram Charan vs. Allu Arjun : పెద్ది సినిమా అప్డేట్…రాంచరణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ రచ్చరచ్చ

గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది.

New Update
Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun: గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది. అయితే ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి వివాదాలు లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తగ్గడం లేదు. నిజానికి నటులు ఏనాడు నేరుగా గొడవపడింది లేదు. ఇద్దరు ఎలాంటి గొడవలు పడడం లేదు కానీ.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్... పెద్ద గొడవే పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో...హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ అంటూ ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 
 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

దీంతో ఇవాళ ఉదయం నుంచి... సోషల్ మీడియాలో పెద్ది సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ దెబ్బకు వెంటనే అలర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు...రామ్ చరణ్ ఫ్యాన్స్ పై యుద్ధమే ప్రకటించారు. AA22 పేరుతో కొత్తగా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ లో అతి త్వరలోనే సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీనిపై ఏప్రిల్ 8వ తేదీన.. అల్లు అర్జున్ బర్త్..డే ఉంది. ఆ రోజునే A A22 మూవీ ప్రకటన రానుందని అంటున్నారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
 
దీంతో రామ్ చరణ్ అభిమానులకు కౌంటర్ గా... ఇవాల్టి నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ట్రెండింగ్ లో ఉన్న పెద్ది సినిమాను అల్లు అర్జున్ కొత్త సినిమా AA22 దాటేసింది. ఇక తాము తగ్గేదే లేదని... రామ్ చరణ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో.. కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇలా ఇద్దరు బడా హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. దీంతో రెండు సినిమాల మీదా ఈ ప్రచారం ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. గతంలో సినిమా అభిమానుల మధ్య ఉన్న మంచివాతావరణం ఈమధ్య చెడిపోతుందన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 

Advertisment
Advertisment
Advertisment