CM Chandrababu : ముగ్గురిని కంటే రూ.30 వేలు..నలుగురిని కంటే రూ. 40 వేలు...సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశుధ్య విప్లవానికి నాంది పలుకుతూ ‘స్వచ్ఛపథం’, ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి ప్రత్యేక డ్రైవ్‌లను ప్రకటించారు.

New Update
FotoJet - 2026-05-16T135315.561

Andhra-Pradesh/CM-Chandrababu-speech-at-Narasannapet

CM Chandrababu : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తానే స్వయంగా పాలుపంచుకుంటున్న 17వ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఇదని గుర్తుచేసిన సీఎం, రాష్ట్రంలో పారిశుధ్య విప్లవానికి నాంది పలుకుతూ ‘స్వచ్ఛపథం’, ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి ప్రత్యేక డ్రైవ్‌లను ప్రకటించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగిస్తూ, సెగ్రిరేషన్ ప్లాంట్ల ద్వారా డంపింగ్ యార్డుల సంస్కృతికి స్వస్తి పలకడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ రూఫ్‌టాప్స్, గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో 8 అవార్డులు రావడం అభినందనీయమన్నారు.

రాష్ట్ర పురోభివృద్ధికి పారిశుధ్యంతో పాటు సంపద సృష్టి కూడా అంతే ముఖ్యమని భావిస్తూ ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడంతో పాటు, రూ.54 లక్షల తలసరి ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రకటించారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ‘పీ4’ (P4) విధానాన్ని తీసుకొచ్చి, సమాజంలోని 10 శాతం మంది సంపన్నులు దిగువన ఉన్న 20 శాతం మంది పేదలను ఆదుకునేలా ‘మార్గదర్శి బంగారు కుటుంబాలు’ కార్యక్రమాన్ని డిజైన్ చేశామన్నారు. జనాభాను ఒక పెద్ద సంపదగా మార్చేందుకు ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ పాలసీ తెస్తున్నామని, అందులో భాగంగానే మూడు లేదా నాలుగో సంతానానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. ముగ్గురు పిల్లలను కంటే రూ.30 వేలు..నాలుగురు పిల్లలను కంటే రూ. 40 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల రికార్డులను ప్రక్షాళన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూముల రికార్డులలో జరిగిన అవకతవకలను సరిదిద్ది, భూ యజమానులకు పూర్తి భద్రత కల్పించేలా తమ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేసి వచ్చే ఏడాది (2027) మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఎలాంటి భూ తగాదాలు, ఆస్తుల వివాదాలు లేకుండా చేసే పూర్తి బాధ్యతను కూటమి ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రజలకు బలమైన హామీ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక, ఐటీ హబ్‌గా తీర్చిదిద్ది, ఇక్కడి నుంచి వలసలను పూర్తిగా నిరోధించి ఇతర ప్రాంతాల వారే ఇక్కడికి వలస వచ్చేలా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వివరించారు. విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు వస్తున్నాయని, భోగాపురం ఎయిర్‌పోర్టును వచ్చే జూలైలో ప్రారంభించబోతున్నామని, పలాసలోనూ మరో ఎయిర్‌పోర్ట్ ఆలోచన ఉందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు డెడ్‌లైన్లు విధిస్తూ.. మద్దువలస స్టేజ్-2ను జనవరి 2027 నాటికి, హీరమండలం ఎత్తిపోతలను ఏప్రిల్ 2027 నాటికి, వంశధార ఫేస్-2ను జూలై 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఆరు దశాబ్దాల సుదీర్ఘ కల అయిన నేరడి బ్యారేజీని రాబోయే మూడేళ్లలో పూర్తి చేసి తీరుతామని సారుూధ్వంసం చేశారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అరాచక పాలన, కుట్రపూరిత రాజకీయాలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019-24 మధ్య గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అచ్చెన్నాయుడు లాంటి బీసీ నేతలను అక్రమ కేసులతో వేధించి, ప్రజల ఆస్తులను 22A లో పెట్టి అభద్రత సృష్టించారని మండిపడ్డారు. సొంత బాబాయిని గొడ్డలితో చంపి, ఆ నిందను నాపై వేసేందుకు చూశారని, ఇలాంటి గొడ్డలి రాజకీయం, డ్రామాలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని హెచ్చరించారు. ఎన్‌సిఆర్‌బి (NCRB) నివేదికల ప్రకారం ఫేక్ న్యూస్ ప్రచారంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందంటే వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి అరాచక శక్తులను ప్రజలంతా ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు