AP News: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాస్పద పనుల నేపథ్యంలో కొలికపూడి మాకొద్దంటూ నియోజకవర్గ పార్టీ కేడర్ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై వేటువేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కొలికపూడి మాకొద్దు..
ఈ మేరకు ఎమ్మెల్యే కొలికపూడి వైఖరికి నిరసనగా తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి శనివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘కొలికపూడి మాకొద్దు.. కొలికపూడి డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగానే గత పది నెలలుగా తిరువూరు నియోజకవర్గంలో జరిగిన క్షేత్రస్థాయి పరిస్థితులు, కార్యకర్తలు లేవనెత్తిన అంశాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చంద్రబాబుకు వివరించారు.
Also Read: SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు
అయితే వారందరికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వైసీపీతో దోస్తీ చేస్తూ టీడీపీ శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కార్యకర్తలను కలుపుకోవడం లేదు. కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పార్టీకి సేవచేస్తున్న స్థానిక నాయకులను బహిరంగంగానే బూతులు తిడుతున్నారు. భవిష్యత్తులోనూ ఆయన తీరులో మార్పు వచ్చే అవకాశం లేదు. మరో అవకాశం ఇచ్చినా వృథా. ఆయనకు ప్రత్యామ్నాయంగా పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షించడానికి ఇన్‌ఛార్జిని నియమించండి. లేకపోతే ఓ సమన్వయ కమిటీనైనా ఏర్పాటు చేయండి' అంటూ డిమాండ్ చేశారు. దీంతో నియోజకవర్గంలో పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్నామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతానని పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
kolikapudi-srinivasa-rao | cm-chandrababu | tiruvuru | telugu-news | today telugu news