/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/dsc.jpg)
CM Chandrababu key statement on AP Mega DSC
AP DSC: టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెంలో ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు. అలాగే మే నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తాం. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీలో కంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
16 వేల 347 టీచర్ పోస్టులు..
ఈ మేరకు ఎన్నికల హామీలో భాగంగా తమ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మార్చిలోనే రిలీజ్ చేయాల్సినప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆలస్యం అయిందని, ఈ కోడ్ ముగియగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పిన అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
'మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ అకాడమిక్ మొదలయ్యే నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. నియామకాల కేటాయింపులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆర్డినెన్స్ జారీ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
mega-dsc | cm-chandrababu | april | telugu-news | today telugu news