/rtv/media/media_files/2025/03/19/4pOaxaZFJhMk0erHoA49.jpg)
Chittoor si Narasimhulu
ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. లంచం కోసం ఓ బాధితురాలి తాళి తాకట్టుపెట్టించాడు ఓ ఎస్సై. చిత్తూరు జిల్లా సోమల ఎస్సైగా పనిచేసిన పోలీస్ అధికారి నరసింహులు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో నరసింహులు పై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఈనెల 15న అతడిని సస్పెండ్ చేశారు.
ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు
తాళి తాకట్టు పెట్టించిన ఎస్సై
అయితే 2023లో నరసింహులు ఎస్సైగా ఉన్న సమయంలో ఓ మహిళా కనిపించకుండాపోవడంతో ఆమె భర్త స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా, మరుసటి రోజే ఆమె స్టేషన్ కి వచ్చి కుటుంబ గొడవల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు ఎస్సైకి తెలిపింది. దీంతో ఎస్సై నీ ఇష్టప్రకారం ఉండాలంటే రూ. లక్ష ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పగా.. మెడలో మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వమని సలహా ఇచ్చాడు. అనంతరం ఆమెను తెలిసిన వ్యాపారి దగ్గరకు పంపి.. ఆమె ఫోన్ పే నుంచి రూ.60 వేలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత విషయం బయటపడడంతో ఓ కానిస్టేబుల్ ద్వారా ఆమెకు తిరిగి డబ్బులు చెల్లించాడు. ఇది మాత్రమే కాదు అనేక కేసుల్లో అవినీతికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
కమ్మపల్లిలో రెండు వర్గాల మధ్య గొడవ జరగ్గా.. ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని యువరాజులు అనే వ్యక్తిని హత్యాయత్నం కేసులో ఇరికించడానికి ఓ వర్గం నుంచి రూ.7 లక్షలు తీసుకున్నారు. అమెరికా వెళ్లాలని అనుకున్న ఆ యువకుడు కేసు నమోదు కావడంతో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. దీనిపై యువరాజులు ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేయగా.. నరసింహులు పై విచారణ జరిపించారు. అలాగే రూ.3 లక్షల విలువైన వెదురుకర్రలు దొంగిలించారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసంటూ మూసేశారు. ఇలా వీటన్నింటిపై ఉన్నాతాధికారులు విచారణ జరపగా.. నరసింహులు పై ఉన్న ఆరోపణలన్నీ వాస్తవాలేనని తేలడంతో సస్పెండ్ చేశారు.
Also Read : భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!
ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?